నా ఇన్నింగ్స్ వారికి అంకితం: యువరాజ్ సింగ్ (వీడియో)
హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో తాను ఆడిన ఇన్నింగ్స్‌ను టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ క్యాన్సర్‌ను జయించిన వారికి అంకితం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా జూన్‌లో వచ్చే తొలి ఆదివారం 'క్యాన్సర్‌ను జయించిన రోజు'గా నిర్వహిస్తారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్, ఫోటోలు, స్కోరు కార్డు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ జూన్ తొలి ఆదివారం నాడే జరిగింది. దీంతో 'క్యాన్సర్ సర్వైవర్ డే' ను పురస్కరించుకొని యువీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. మ్యాచ్ అనంతరం లండన్‌లో శనివారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నట్లు యువీ పేర్కొన్నాడు.

భారత విజయంలో యువీ కీలకపాత్ర
ఉగ్రదాడుల బాధితుల కోసం తాను ప్రార్థిస్తున్నట్టు చెప్పాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 319 పరుగుల భారీ స్కోరు సాధించడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో యువీ పాకిస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడు. కేవలం 32 బంతుల్లో యువీ 53 పరుగులు చేయడంతో భారత్ తన చివరి 11 ఓవర్లలో భారత్ 127 పరుగులు రాబట్టింది.
29 బంతుల్లోనే అర్ధ సెంచరీ
11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో యువరాజ్ 29 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించాడు. దీంతో చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. అంతేకాదు పాకిస్థాన్‌పై వేగంగా అర్ధ సెంచరీ సాధించిన రెండో భారతీయుడిగా కూడా రికార్డు సొంతం చేసుకున్నాడు.
పది ఓవర్లలో 93 పరుగుల భాగస్వామ్యం
కెప్టెన్ కోహ్లీ క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకుంటున్న సమయంలో యువరాజ్ కోహ్లీతో కలిసి కేవలం పది ఓవర్లలో 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 32 బంతుల్లో 53 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న యువీ ట్విట్టర్‌లో తన ఇన్నింగ్స్‌ను క్యాన్సర్‌ను జయించిన వారికి అంకితమిస్తున్నట్లు వెల్లడించాడు.

గతంలో క్యాన్సర్ బారిన పడిన యువరాజ్
గతంలో యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో చికిత్స పొంది క్యాన్సర్ వ్యాధిని జయించి తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications