న్యూఢిల్లీ: బంతిని స్టాండ్స్‌లోకి పంపించడమే కాదు, అందమైన అమ్మాయిలతో డేటింగ్ చేయడంలో కూడా టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ముందు వరసులో ఉంటాడు. యువరాజ్ సింగ్ డేటింగ్ చేసిన ముద్దుగుమ్మల జాబితా చెబితే చాలా పెద్దదిగానే ఉంటుంది.

గతంలో బాలీవుడ్ భామలు దీపిక పదుకోన్, ప్రీతి జింతా, కిమ్ శర్మ, నేహా ధూపియాలతో అఫైర్ నడిపి వార్తల్లో నిలిచిన యువరాజ్ సింగ్ తాజాగా, బ్రిటిష్ మోడల్, యాక్టర్ హాజెల్ కీచ్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఇటీవల లండన్‌లో బాగా ఎంజాయ్ చేసి మళ్లీ భారత్‌కు రావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన 'బాడీగార్డ్' లో హజెల్ కీజ్ నటించింది. 28ఏళ్ల హజెల్ కీజ్ బిల్లా సినిమాతో పాటు, ఓ కార్ యాడ్‌లోనూ నటించింది.