రిటైర్మెంట్ యోచనలో యువీ: విదేశీ టి20 టోర్నీలపై ఆసక్తి

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ యోచనలో ఉన్నాడు. ఒకానొక సమయంలో వన్డేల్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకడిగా ఉన్న యువరాజ్ సింగ్ ప్రస్తుతం విదేశీ టి20 టోర్నీలపై ఆసక్తి కనబరుస్తున్నాడు. అయితే, యువీ ఐసీసీ ఆమోదిత టీ20 లీగ్‌ల్లో ఆడాలని భావిస్తున్నాడు.

బీసీసీఐ అంగీకరిస్తేనే
అయితే, ఇందుకు బీసీసీఐ అంగీకరిస్తేనే. ఈ విషయాన్ని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. "అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు కూడా యువరాజ్ వీడ్కోలు పలకాలనుకుంటున్నాడు. అతడికి జీటీ20 (కెనడా), యూరో టీ20స్లామ్ (ఐర్లండ్, హాలెండ్)ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ వీటిలో ఆడాలంటే ముందుగా బీసీసీఐ అంగీకారం తప్పనిసరి" అని అన్నారు.

బోర్డు నుంచి స్పష్టత కోసం యువీ
"యువరాజ్ బోర్డు నుంచి స్పష్టత కోరుతున్న మాట వాస్తవమే. త్వరలోనే ఈ విషయమై యువరాజ్ బోర్డుతో మాట్లాడనున్నాడు. అయితే యువీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా... బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత్‌లో రిజిస్టర్ టి20 ప్లేయర్. ఈ నేపథ్యంలో టి20ల్లో ఆడే వెసులుబాటు ఉందో లేదో ఓసారి చూసుకోవాలి" అని ఆ అధికారి ఒకరు తెలిపారు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లకు బిగ్‌బాష్, సీపీఎల్, బీపీఎల్‌ల నుంచి ఆఫర్లు వస్తే వాటిలో ఆడేందుకు అనుమతించాలనే నిబంధన కూడా ఉన్నట్టు ఆ అధికారి గుర్తుచేశారు. అయితే, కరీబియన్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు ఇటీవల బోర్డు నిరాకరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications