Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్‌కు అరుదైన గౌరవం: డాక్టరేట్ ప్రకటించిన ఐటీఎం వర్సిటీ

Yuvraj Singh conferred with honorary doctorate for his 'extraordinary sporting prowess'

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఇకపై యువరాజ్ సింగ్‌ని డాక్టర్ యువరాజ్ సింగ్ అని పిలవాలి. ఎందుకంటే గ్వాలియర్‌కు చెందిన ఐటీఎం యూనివర్సిటీ యువరాజ్ సింగ్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది.

క్రికెటర్‌గా భారత్‌కు అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగం కావడంతో పాటు క్యాన్సర్‌తో పోరాడి అనేక మందికి స్ఫూర్తిగా నిలవడం వల్లే యువీకి ఈ గౌరవ డిగ్రీని ఇస్తున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. యువీతో పాటు డాక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్(స్పేస్), గోవింద్ నిహ్లాని (ఫిల్మ్), డాక్టర్ అశోక్ వాజపేయి (సాహిత్యం), రజత్ శర్మ(మీడియా), డాక్టర్ ఆర్ఏ మాషేల్కర్ (సైన్స్ అండ్ టెక్నాలజీ), అరుణా రాయ్ (సోషల్ వర్క్)లను కూడా డాక్టరేట్‌తో సత్కరించనున్నారు.

Yuvraj Not Part Of 74 Players As Selectors Name Board President's XI

తనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడంపై యువరాజ్ స్పందించాడు. 'గౌరవ డాక్టరేట్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవం తనపై మరంత బాధ్యతలను పెంచిందని... భవిష్యత్తులోనూ తన సేవాకార్యక్రమాలు కొనసాగుతాయి' అని యువరాజ్ తెలిపాడు. ఇక, భారత్ తరుపున అన్ని ఫార్మెట్లు కలుపుకుని యువరాజ్ పదివేలకు పైగా పరుగులు చేశాడు.

2011 వరల్డ్ కప్‌లో భారత్‌కు వరల్డ్ కప్ అందించడంలో ముఖ్యభూమిక పోషించాడు. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని కూడా అందుకున్నాడు. యువరాజ్ సింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ని ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాదిన సంఘటనే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 1, 2017, 13:07 [IST]
Other articles published on Dec 1, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+