Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేల్.. కాకా!! నువ్వేంటి ఇక్కడున్నావ్?: యువరాజ్

Yuvraj Singh compares Chris Gayle to a cartoon character in funny Instagram banter

న్యూ ఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్‌ని కార్టూన్‌తో పోలుస్తూ వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరదాగా ఆటపట్టించాడు. సుదీర్ఘకాలంగా ఆప్త మిత్రుల్లా కొనసాగుతున్న ఈ జోడీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కలిసి ఆడిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం యువరాజ్ సింగ్ భారత జట్టుకి దూరమై దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు.

వెస్టిండీస్‌ జట్టుకి దూరంగా ఉంటున్న క్రిస్‌గేల్ ఇప్పుడు దుబాయ్ వేదికగా జరుగుతున్న అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. తాజాగా ముంబైలోని ఓ సినిమా థియేటర్‌కి వెళ్లిన యువరాజ్ సింగ్.. అక్కడ ప్రచారంలో భాగంగా ఉంచిన హాలివుడ్ సినిమాలోని సైన్స్ ఫిక్సన్ క్వారెక్టర్‌తో ఫొటో దిగాడు. అనంతరం దాన్ని అభిమానులతో పంచుకుంటూ.. ఆ క్యారెక్టర్‌ని క్రిస్‌గేల్‌తో పోల్చాడు.

'కాకా.. నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు..? నువ్వు దుబాయ్‌లో ఉన్నావు అనుకుంటున్నా' అని రాసుకొచ్చాడు. అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో క్రిస్‌గేల్ వరుస హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. చివరిగా ముగిసిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతను 53, 73, 80 పరుగులతో సత్తాచాటాడు. టెస్టు సిరీస్ అనంతరం జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు క్రిస్ గేల్ లాంటి ప్లేయర్లు ఉంటే జట్టుకు మంచి బలం చేకూరుతుందని ఆ దేశ సీనియర్ క్రికెటర్లు చెప్పుకొస్తున్నారు.

మరోవైపు యువరాజ్ సింగ్ కూడా ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో 264 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుకానుండగా.. ఈ సిరీస్‌కి క్రిస్‌గేల్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Saturday, October 20, 2018, 14:30 [IST]
Other articles published on Oct 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+