వావ్! వదినా: కోహ్లీ లవర్ అనుష్కపై యువరాజ్ కామెంట్
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ప్రేయసి, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ పైన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు. అనుష్క శర్మ తాజా చిత్రం బాంబే వెల్వెట్ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాలతో అనుష్క శర్మ చాలా బిజీగా ఉంది. ఆ సినిమాలో తన పాత్ర పేరు చెబుతూ.. మెనీ మూడ్స్ ఆఫ్ రోజీ, బాంబే వెల్వెట్ మే 15న రానుందని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ పోస్టు పైన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వెంటనే స్పందించాడు. ఆ ఫోటోలకు లైక్ కొట్టాడు.

కామెంట్ చేశాడు. అందులో అనుష్క శర్మను బాబీ (వదిన) అని అభివర్ణించాడు. 'ఓహో హోయే రోజీ బాబీ! లుకింగ్ ఆసమ్' అని రాశాడు.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. తొలుత వారు దానిని బహిర్గతం చేయలేదు. ఆ తర్వాత ఇరువురు కూడా తాము ప్రేమించుకుంటున్న విషయాన్ని అంగీకరించారు. ఆ తర్వాత ఇరువురు బహిరంగంగా కనిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications