'రైనా.. రాయుడులా యువీ కూడా చెన్నైతో కలవాలి'

హైదరాబాద్: 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి ఆడిన యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీంతో.. ఇటీవల ఆ ఫ్రాంఛైజీ యువీని వేలంలోకి విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. డిసెంబరులో జరగనున్న ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలోకి ఈ వెటరన్ ఆల్‌రౌండర్ రానున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆడాలని అతని అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
చెన్నై యువీని కొనుగోలు చేస్తే..
ధోనీ కెప్టెన్సీలో 30 ప్లస్ జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో యువీని కొనుగోలు చేస్తే.. అతని కెరీర్ మళ్లీ గాడిన పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం పేలవ ఫామ్, ఫిట్‌నెస్ లేమితో సతమతమవుతోన్న కారణంగా యువీ గతేడాది మధ్యలో భారత్ జట్టుకి దూరమైయ్యాడు. పునరాగమనం కోసం పరితపిస్తున్న యువీ ప్రయత్నాలు ఫలించడం లేదు. దానికి తోడు ఐపీఎల్‌లోనూ ఏ ఫ్రాంఛైజీ ఏడాదికి మించి అతడ్ని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు.
ధోనీ కెప్టెన్సీలో మళ్లీ లయ అందుకుంటాడని
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి యువీ వెళ్తే.. ధోనీ కెప్టెన్సీలో అతను మళ్లీ మునుపటి లయ అందుకుంటాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నైకి ఆడిన అంబటి రాయుడు.. 500+ స్కోరు చేయడమే కాకుండా.. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ భారత్ జట్టులోకి ఈ ఏడాది పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. రాయుడితో పాటు రైనా కూడా ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరపున మెరుపులు కురిపించాడు.
మెగా టోర్నీలో అవకాశం రావొచ్చనే
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కంటే ముందు ఐపీఎల్ జరగనుంది. ఒకవేళ యువీ ఫామ్ అందుకోగలిగితే మాత్రం ఆ మెగా టోర్నీలో అవకాశం రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ యువరాజ్ సింగ్ క్రియాశీలక పాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications