Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

థాయ్‌లాండ్‌లో యువరాజ్‌ సందడి.. సచిన్‌, హర్భజన్‌తో బర్త్‌డే వేడుకలు!!

Yuvraj Singh celebrates birthday with Sachin Tendulkar, Harbhajan Singh in Thailand

బ్యాంకాక్‌: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ గురువారం తన 38వ పుట్టినరోజు వేడుకలను థాయ్‌లాండ్‌లో ఘనంగా జరుపుకున్నాడు. సహచర ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్, జహీర్ ఖాన్, అజిత్‌ అగార్కర్‌, జహీర్ ఖాన్, హర్భజన్‌ సింగ్‌తో కలిసి సరదాగా గడిపాడు. అందరూ కలిసి అక్కడి ఓ హోటల్లో యువీతో కలిసి కేక్ కట్ చేపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు.

 థాయ్‌లాండ్‌లో బర్త్‌డే వేడుకలు

థాయ్‌లాండ్‌లో బర్త్‌డే వేడుకలు

యువరాజ్ బర్త్‌డే వేడుకల ఫొటోలను హర్భజన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 'హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌. కలకాలం సంతోషంగా ఉండాలి' అని రాసుకొచ్చాడు. 'సూపర్‌స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా' అని సచిన్‌ ట్వీట్ చేసాడు. ఐసీసీ, బీసీసీఐ, క్రికెటర్లు, మాజీలు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. యువీ బర్త్‌డే ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

జూన్‌లో క్రికెట్‌కు వీడ్కోలు:

జూన్‌లో క్రికెట్‌కు వీడ్కోలు:

ఈ ఏడాది జూన్‌లో యువరాజ్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ భారత్‌ గెలవడంతో యువీ కీలక పాత్ర పోషించాడు. 19 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని యువరాజ్ కల్పించుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్‌గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా.. ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

క్యాన్సర్‌ను జయించి:

క్యాన్సర్‌ను జయించి:

ఏప్రిల్ 2, 2011న యువీకి క్యాన్సర్ ఉందని గుర్తించారు. శస్త్రచికిత్స అవసరం లేదనడంతో ఊపిరి పీల్చుకున్న యువరాజ్ సింగ్‌కు మూడు దశలుగా కీమోథెరపీ చికిత్స అందించారు. దీంతో యువీ క్యాన్సర్‌ను జయించాడు. అనంతరం క్యాన్సర్ బాధితులకు అండగా నిలవాలని యువరాజ్ అనుకున్నాడు. ఇందులో భాగంగా 'యువీకెన్' పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు.

304 వన్డేలు.. 8701 పరుగులు

304 వన్డేలు.. 8701 పరుగులు

యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Friday, December 13, 2019, 11:26 [IST]
Other articles published on Dec 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+