అమృత్‌సర్: క్రికెటర్ యువరాజ్ సింగ్ పైన గృహహింస కేసు నమోదయింది. సోదరుడు జోరవర్ సింగ్ భార్య, బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ ఆకాంక్ష శర్మకేసు పెట్టారు. యువరాజ్ సింగ్‌తో పాటు భర్త జోరవర్ సింగ్, అత్త షబ్నం సింగ్‌లపై ఆమె కేసు పెట్టినట్లు ఆమె లాయర్ స్వాతిసింగ్ తెలిపారు.
చాలా రోజుల నుంచి ఆకాంక్ష, జరోవర్‌లు విడిగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. ఆకాంక్ష వద్ద ఉన్న నగలను తిరిగి ఇచ్చేయాలని ఇటీవల యురాజ్ తల్లి కేసు వేసింది.

అయితే గృహ హింస కేసులో యువరాజ్‌పై ఎలా కేసు నమోదు చేస్తారని అడగగా.. శారీరక హింస కింద మాత్రమే ఈ కేసు నమోదు చేయరని, మానసిక, ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చిన వారిపై కూడా ఈ కేసు నమోదు చేయవచ్చునని, ఈ నేపథ్యంలో యువరాజ్ పేరు చేర్చాల్సి వచ్చిందని, బిడ్డని కనాలంటూ జరోవర్, షబ్నం.. ఆకాంక్షపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఈ విషయంలో యువీ తన కుటుంబసభ్యులకు మద్దతు పలుకుతున్నాడని, అందుకే అతని పేరు జత చేయాల్సి వచ్చిందని లాయర్ తెలిపారు.