For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభ్‌మన్‌ గిల్‌ మంచోడు.. అతనిలో స్పెషల్ టాలెంట్ ఉంది: యువరాజ్‌

Yuvraj Singh Backs Special Talent Shubman Gill to Shine for India

ముంబై: టీమిండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై మాజీ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ ‌సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్‌ చాలా మంచోడని, ఎవరితోనూ వాగ్వాదానికి దిగడని చెప్పాడు. గిల్‌లో ప్రత్యేక ప్రతిభ ఉందని కొనియాడాడు. 21 రోజుల శిబిరంలో పంజాబ్‌ జట్టుకు మార్గనిర్దేశం చేయడం బాగుందని యువీ పేర్కొన్నాడు. ఆట మొదలు పెట్టినప్పుడు తనకూ ఎంతో మంది మెంటార్లు ఉండేవారని ఆయన గుర్తుచేసుకున్నాడు.

తాజాగా యువరాజ్ ‌సింగ్‌ హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ... 'శుభ్‌మన్‌ గిల్‌ ప్రవర్తన ఎంతో బాగుంటుంది. గతేడాది డిల్లీతో జరిగిన రంజీ మ్యాచులో అంపైర్‌ ఔటిస్తే గిల్‌ అసహనం వ్యక్తం చేశాడు. అతడు కేవలం అంపైర్ నిర్ణయాన్ని మాత్రమే ప్రశ్నించాడు. తమను తాము నిరూపించుకోవాలని భావిస్తున్న యువ బ్యాట్స్‌మెన్‌ అలాగే ఉంటారు. మొదట్లో నాకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. పొరపాట్లు చేస్తే సరిదిద్దుకుంటారు. గిల్‌లో ప్రత్యేక ప్రతిభ ఉంది' అని ప్రశంసించాడు.

21 రోజుల శిబిరంలో పంజాబ్‌ జట్టుకు మార్గనిర్దేశం చేయడం బాగుందని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఆట మొదలు పెట్టినప్పుడు తనకూ ఎంతో మంది మెంటార్లు ఉండేవారని గుర్తుచేసుకున్నాడు. ఆటగాళ్లకు అత్యుత్తమ వసతులు కల్పిస్తున్న పంజాబ్‌ క్రికెట్‌ సంఘానికి యువీ కృతజ్ఞతలు తెలిపాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పునీత్ బాలిని సంప్రదించిన తరువాత యువరాజ్ 21 రోజుల ఆఫ్-సీజన్ శిబిరంలో ఆ జట్టుకు మెంటరింగ్ ఇస్తున్నాడు.

'క్రికెట్‌, స్కేటింగ్‌ నేను ప్రేమించే క్రీడలు. ఇప్పుడు ఖాళీ సమయం ఉండటంతో గోల్ఫ్‌ నేర్చుకుంటున్నా. ఇది ఒక వ్యసనమైన క్రీడ. ఇప్పుడు నేను గోల్ఫ్ బాగా ఆడుతున్నా. అంతర్జాతీయ క్రికెట్‌ లీగులు ఆడాలనుకుంటున్నా. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లీగులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేం' అని యువీ పేర్కొన్నాడు. గత సంవత్సరం గ్లోబల్ టీ20 లీగ్ మరియు టీ10 లీగులు యువీ ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో యువీ 40 టెస్టుల్లో, 304 వన్డేల్లో, 58 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

గతేడాది వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో యువీ హాఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. యువరాజ్‌ సింగ్‌ భారత్ తరఫున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Saturday, August 1, 2020, 13:25 [IST]
Other articles published on Aug 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+