ఆ ఆరు సిక్సుల గురించి మర్చిపోండి.. బ్రాడ్‌ను మ‌న‌స్పూర్తిగా అభినందించండి: యూవీ

ముంబై: టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా ఇంగ్లండ్ సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌‌ రికార్డు నెలకొల్పాడు. సుధీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్ల మైలురాయిని అధిరోహించిన నాలుగో ఫాస్ట్ ‌బౌలర్‌గా నిలిచి దిగ్గజాల సరసన చేరాడు. మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో బ్రాడ్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. 140 టెస్టుల్లోనే బ్రాడ్‌ అద్భుత రికార్డును అందుకోవడం విశేషం. బ్రాడ్ 500 వికెట్ల మైలురాయిని సాధించ‌డం ప‌ట్ల క్రికెట్ అభిమానుల‌తో పాటు ప‌లువురు క్రికెట‌ర్లు అత‌న్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్.. బ్రాడ్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు.

అభిమానులకు యూవీ విజ్ఞప్తి

స్టువర్ట్‌ బ్రాడ్, యువ‌రాజ్ సింగ్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిందంటే.. సగటు క్రికెట్ అభిమానికి 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గుర్తుకురాక మాన‌దు. ఆండ్రూ ఫ్లింటాఫ్ మీద‌ కోపంతో బ్రాడ్ వేసిన ఆరు బంతుల‌ను యూవీ ఆరు సిక్సులుగా మ‌లిచి అత‌డి కెరీర్‌లో ఆ ఓవ‌ర్‌ను ఓ పీడ క‌ల‌గా మిగిల్చాడు. అయితే 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న బ్రాడ్‌ను యూవీ ట్విట‌ర్ వేదిక‌గా త‌న‌దైన శైలిలో ప్ర‌శంసించాడు. యూవీ తన ట్వీట్‌లో అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. అభిమానులారా.. ఆ ఆరు సిక్సుల గురించి మర్చిపోండి.. బ్రాడ్‌ను ఇప్పుడు మ‌న‌స్పూర్తిగా అభినందించండి అని కోరాడు.

మ‌న‌స్పూర్తిగా అభినందించండి

మ‌న‌స్పూర్తిగా అభినందించండి

'స్టువర్ట్‌ బ్రాడ్ గురించి నేను ఏదైనా చెప్పిన ప్ర‌తీసారి అభిమానులు 2007 టీ20 ప్ర‌పంచ‌ప‌క‌ప్ మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌కు బ‌లైన బౌలర్‌గానే చూస్తారు. కానీ ఈసారి అభిమానులకు ఓ విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. ఆ విష‌యం ఇక వ‌దిలేయండి. 500 వికెట్లు తీసిన బ్రాడ్‌ను ఇప్పుడు మ‌న‌స్పూర్తిగా అభినందించండి. ఎందుకంటే టెస్టుల్లో 500 వికెట్ల‌ను సాధించ‌డ‌మ‌నేది చాలా గొప్ప విష‌యం. ఆ మ్యాజిక్‌ను బ్రాడ్ చేసి చూపించాడు. 500 వికెట్ల ఫీట్‌ను సాధించ‌డం కోసం బ్రాడ్ అంకిత‌భావంతో చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. నిజంగా బ్రాడ్ ఒక లెజెండ్.. హాట్సాఫ్' అంటూ యూవీ ట్వీట్ చేశాడు.

7వ బౌలర్‌గా

7వ బౌలర్‌గా

మాంచెస్టర్‌లో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ను ఔట్‌ చేయడం ద్వారా 500వ వికెట్‌ను స్టువర్ట్‌ బ్రాడ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌ ప్రపంచంలో 500 వికెట్లు తీసిన 7వ బౌలర్‌గా నిలవడంతో పాటు ఈ రికార్డును సాధించిన ఫాస్ట్‌ బౌలర్లలో నాలుగో ఆటగాడిగా బ్రాడ్‌ నిలిచాడు. ఇక ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండవ బౌలర్‌గా ఉన్నాడు. బ్రాడ్‌ కంటే ముందు జేమ్స్ అండర్సన్ 500 వికెట్ల క్లబ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ‌వారిలో వ‌రుస‌గా ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ ‌(800), షేన్ వార్న్‌ (708), అనిల్ కుంబ్లే (619), జేమ్స్‌ అండర్సన్ ‌(589), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (563), కౌట్నీ వాల్ష్ ‌( 519) ఉన్నారు.

క్యాన్సర్‌ జయించాక.. సచిన్ మాటలే క్రికెట్‌లోకి తిరిగొచ్చేలా చేశాయి: యూవీ

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 29, 2020, 18:48 [IST]
Other articles published on Jul 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X