Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెప్పుతో కొట్టే టైం వచ్చింది.. ఆ ప్లేయర్లపై యువీ ఆగ్రహం!

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా ముగిశాయి. ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రయాణం క్రికెట్ అభిమానులకు ఓ బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ టోర్నీ ప్రారంభంలో తిరుగులేని శక్తిగా కనిపించిన పంజాబ్ కింగ్స్.. సెకండాఫ్‌కు వచ్చేసరికి ఘోరంగా విఫలమైంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఆడిన మొదటి 7 మ్యాచ్‌లలో ఏకంగా 6 మ్యాచ్‌లు గెలిచి , ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడంతో పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. ఇంతటి అద్భుతమైన ఆరంభం లభించినప్పటికీ.. ఆ తర్వాత వరుస పరాజయాల పాలైన పంజాబ్ జట్టు.. చివరికి ప్లేఆఫ్స్ రేసు నుంచి అత్యంత దారుణంగా నిష్క్రమించింది. ఈ ఘోర పరాజయం తర్వాత జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై, వారి బాధ్యతారాహిత్యంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందిన ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ఘోరంగా విఫలమై ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటకు వచ్చేసినా.. ఆటగాళ్లు సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడంపై యువీ మండిపడ్డాడు. వారిని ఉద్దేశించి "మీ అందరినీ చెప్పుతో కొట్టే సమయం వచ్చింది" అంటూ సోషల్ మీడియాలో నేరుగానే కామెంట్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అయితే యువీ ఈ కామెంట్లను పూర్తి శత్రుత్వంతో కాకుండా గురువు స్థానంలో ఉండి కాస్త సీరియస్ అండ్ ఫన్నీగా హెచ్చరించడం గమనార్హం.

Yuvraj Singh Angry Comment on Punjab Kings Players Time to Hit with Slippers Full Details

యువీ అలా కామెంట్ చేయడానికి కారణం ఇదే..!
ఈ వివాదానికి దారితీసిన అసలు కారణాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2026 ఆఖరి లీగ్ మ్యాచ్ ముగిసి ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతైన తర్వాత పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ ఫోటోలో అతనితో పాటు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, యువ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య ఉన్నారు. హర్‌ప్రీత్ బ్రార్ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇస్తూ.. అర్ష్‌దీప్ సింగ్‌ను బ్లాగర్ అని.. ప్రియాన్ష్ ఆర్యను స్లాగర్ అని సరదాగా పేర్కొన్నాడు. జట్టు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన బాధలో ఫ్యాన్స్ ఉంటే.. వీళ్లు కనీసం ఆ గెలుపోటములపై బాధపడకుండా ఇలా పోస్టులు పెట్టడం చూసి యువరాజ్ సింగ్‌కు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఆ పోస్ట్ కింద "మీ ముగ్గురినీ చెప్పుతో కొట్టే టైం వచ్చింది" అంటూ యువీ ఘాటుగా కామెంట్ పెట్టి క్లాస్ పీకాడు.

నిజానికి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ఈ ముగ్గురు ప్లేయర్లకు యువరాజ్ సింగ్ ప్రత్యేకంగా పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం యువరాజ్ సింగ్ భారత్ లోని పలువురు యువ ఆటగాళ్లకు కోచ్‌గా, మెంటార్‌గా వ్యవహరిస్తూ వారి కెరీర్‌ను తీర్చిదిద్దుతున్నాడు. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన యువ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య ఆటతీరును మెరుగుపరచడం కోసం, అతనికి ఐపీఎల్ అవకాశాలు వచ్చేలా చేయడం కోసం యువీ ఎంతో శ్రమించాడు.ఈ కారణంగానే ఈ యువ ప్లేయర్లు యువరాజ్ సింగ్‌ను'యువీ పాజీ' అంటూ ఎంతో గౌరవిస్తారు. అందుకే గురువు స్థానంలో ఉన్న యువీ, టోర్నీలో విఫలమై సోషల్ మీడియాలో నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఆ ముగ్గురి తప్పులను బహిరంగంగానే మందలించి క్రమశిక్షణ నేర్పాడు.

Story first published: Monday, May 25, 2026, 13:37 [IST]
Other articles published on May 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+