Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీ చెప్పిన ఒక్క మాటతో ఆట మారిపోయింది- అభిషేక్ శర్మ

ఆరేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలిసారిగా ఫైనల్‌కు అర్హత సాధించింది. చెపాక్ వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తుది పోరుకు క్వాలిఫై అయింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరు కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

అయితే ఎస్‌ఆర్‌హెచ్ సాధించిన విజయాల్లో భారత కుర్రాడు అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. క్వాలిఫయిర్-1 వరకు విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు సాయపడిన అభిషేక్ క్వాలిఫయిర్-2లో మాత్రం స్పిన్నర్‌గా సత్తాచాటాడు. తనలో మంచి ఆల్‌రౌండర్ ఉన్నాడని, తన గురువు యువరాజ్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో నాణ్యమైన బౌలర్‌గా మారుతున్నాని అభిషేక్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.

Yuvraj Singh always said I could be a better bowler than him - Abhishek Sharma

తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 175 పరుగులు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో, 4x6) అర్ధశతకంతో సత్తాచాటాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ (56*; 35 బంతుల్లో, 7x4, 2x6) పోరాడాడు. షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటుతో విఫలమైనా బంతితో సత్తాచాటాడు. నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులే ఇచ్చి కీలక ప్లేయర్లు సంజు శాంసన్, హెట్మెయిర్‌ను ఔట్ చేశాడు. కాగా, అభిషేక్ తన బౌలింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ''యువరాజ్ సింగ్‌తో బౌలింగ్ గురించి చర్చించిన సమయంలో ఆయన ఒకే విషయం చెబుతుండేవాడు. యువీ కంటే నేనే గొప్ప బౌలర్ అవుతానని అని చెబుతుంటాడు. ఆ మాట నా మదిలో ఎప్పుడూ ఉంటుంది. బౌలింగ్‌తోనూ నేను సత్తాచాటితే యువీ ఎంతో సంతోషిస్తాడు''

''బౌలింగ్ విషయంతో మా నాన్న కూడా ఎంతో ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే మా తండ్రి కూడా ఎడమచేతి వాటం స్పిన్నరే. అయితే నేను బౌలింగ్‌పై శ్రమిస్తూ ఉంటే జట్టు కోసం మరింత చేయగలను. జూనియర్ క్రికెట్ స్థాయిలో ఎన్నో వికెట్లు పడగొట్టాను'' అని అభిషేక్ అన్నాడు. బౌలింగ్ అవకాశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని అభిషేక్ చెప్పాడు. అయితే కెప్టెన్ కమిన్స్, కోచ్ వెటోరి అంత సులువుగా తనకి అవకాశం ఇవ్వరని, ఎందుకంటే తన బౌలింగ్‌ను వాళ్లు ఎక్కువగా చూడలేదని చెప్పాడు.

Story first published: Saturday, May 25, 2024, 16:16 [IST]
Other articles published on May 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+