గువాహతి: క్రికెట్లో సిక్సర్లతో అలరించిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. యాక్టర్‌గా మారబోతున్నాడు. గతేడాదే అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ సిక్సర్ల సింగ్.. యాక్టర్‌గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నాడు. అవును యువీ ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నాడు. అసోంకు చెందిన డ్రీమ్హౌజ్ ప్రొడక్షన్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తుండగా.. యువీ సోదరుడు జొరావర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు.
ఈ వెబ్ సిరీస్‌లో యువరాజ్ సతీమణి హజెల్ కీచ్ సైతం కీలక పాత్ర పోషించనుంది. ఇక యువీ తల్లి షబ్నమ్ సింగ్ ఈ వెబ్‌సిరీస్ నిర్మాణంలో భాగమవుతుండటం మరో విశేషం. ఈ విషయాన్ని షబ్నమే వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్‌లో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
'ఈ ప్రపంచం అసలైన యువరాజ్ సింగ్, జొరావర్ సింగ్‌ను చూడనుంది. ఈ వెబ్‌సిరీస్‌లో ముఖ్య పాత్రను నా చిన్న కొడుకు జొరావర్ పోషిస్తున్నాడు. నా కోడలు, నా కుమారులను చూసి ఒక తల్లిగా ఎంతో గర్విస్తున్నాను' అని షబ్నమ్ సింగ్ తెలిపారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తదుపరి చిత్రం 'బచ్చన్ పాండే' కథా రచయిత విపిన్ ఉనియల్ ఈ వెబ్ సిరీస్‌లో భాగమవుతున్నారు. బాలీవుడ్‌లోని మరికొందరు నటులు ఇందులో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్, అతని సోదరుడు జొరావర్ సింగ్ నటించనున్న వెబ్ సిరీస్ నిర్మించడం గౌరవంగా ఉందని డ్రీమ్హౌజ్ ప్రొడక్షన్స్‌కు చెందిన నీత శర్మ తెలిపింది. ప్రతిభ కలిగిన వారికి అవకాశం కల్పించచడం తమ ప్రొడక్షన్ లక్ష్యమని పేర్కొంది.