Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yuvaraj Singh: వాళ్ల బ్యాటింగ్ చూస్తే నన్ను నేనే చూసుకున్నట్లు అనిపిస్తుంది

Abhishek Sharma and Shivam Dubeys batting style is same like mine

2007 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా జట్టు విజయం సాధించడంలో యువరాజ్ సింగ్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తన అద్భుతమైన హిట్టింగ్ సామర్థ్యంతో టీ20 క్రికెట్లో యువరాజ్ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. యువరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తా చాటాడు. మధ్యలో క్యాన్సర్ బారిన పడి కాస్త దెబ్బతిన్న యువీ.. తర్వాత కూడా క్రికెట్ ఆడినప్పటికీ అంతగా రాణించలేకపోయాడు. ఏదేమైనా టీమిండియా తరఫున గుర్తుంచుకోదగ్గ ఆటగాడిగా యువీ నిలిచిపోయాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన యువీ ఎప్పుడెప్పుడూ తన అభిప్రాయాలను, క్రికెటర్ల నైపుణ్యాలను ప్రస్తావిస్తూ టచ్‌లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్‌ టోర్నమెంట్‌ను ఆసాంతం ఫాలో అవుతున్న యువీ.. మ్యాచ్‌లపై తన అభిప్రాయాలను వెల్లడించడమే కాకుండా, చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్ల గురించి ప్రస్తావిస్తున్నాడు. తాజాగా అతను మరో ఆసక్తికర విషయాన్ని తెలియజెప్పాడు. ఈ ఐపీఎల్లో తన లాగే బ్యాటింగ్ చేసే ఇద్దరు ఆటగాళ్లను చూశానని పేర్కొన్నాడు.

అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది

అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది

యువరాజ్ స్వరాష్ట్రమైన పంజాబ్ తరఫున లిస్ట్ ఏ క్రికెట్ ఆడుతున్న ప్రస్తుత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ తనలాగే ఉంటుందని యువీ పేర్కొన్నాడు. 'నేను అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసినప్పుడల్లా.. నా బ్యాటింగ్ నాకు చాలా గుర్తుకొస్తుంది. అతని పుల్ షాట్, అతను కొట్టే బ్యాక్‌ఫుట్ షాట్ అచ్చు నాలాగే అనిపిస్తాయి. నేను అతని బ్యాటింగ్ చూడ్డానికి చాలా ఇష్టపడతాను' అని స్పోర్ట్స్ 18 ఇంటర్వ్యూలో యువరాజ్ తెలిపాడు.

కన్సిస్టెన్సీగా రాణిస్తున్న అభిషేక్ శర్మ

కన్సిస్టెన్సీగా రాణిస్తున్న అభిషేక్ శర్మ

ఈ సీజన్‌లో సన్ రైజర్స్ తరఫున అభిషేక్ శర్మ కన్సిస్టెన్సీగా రాణిస్తున్నాడు. స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతను 132.40 స్ట్రైక్ రేట్‌తో 331పరుగులు చేశాడు. సన్ రైజర్స్ తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అభిషేక్ శర్మ మొదటి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఇక తనలాగే బ్యాటింగ్ చేసేవారిలో యువరాజ్ పేర్కొన్న మరో ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన శివమ్ దూబే. అంతర్జాతీయ స్థాయిలో దూబేకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని యువీ భావించాడు.

దూబే సైతం నాలాగే బ్యాటింగ్ చేస్తాడు

దూబే సైతం నాలాగే బ్యాటింగ్ చేస్తాడు

దూబే ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడాడు, 160.34 స్ట్రైక్ రేట్‌తో 279 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికీ దూబే కొన్ని మ్యాచ్‌లు బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇక యువీ దూబే గురించి మాట్లాడుతూ.. 'శివమ్ దూబేకి కూడా నా స్టైల్ ఉంది. అతను చాలాకాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. అతని వయస్సు 28 సంవత్సరాలు. అతను వన్డే క్రికెట్ ఇంకా ఎంతకాలం ఆడతాడో నాకు తెలియదు. ఇక దూబే అయినా, అభిషేక్ శర్మ అయినా ఇంకెవరైనా వారిలో ప్రతిభ ఉందని మీకు అనిపిస్తే, మీరు తప్పకుండా తగినన్ని అవకాశాలు కల్పించాలి. అప్పుడే వారిలోని అసలు సామర్థ్యం, ట్యాలెంట్ వెలుగుచూస్తుందని' యువీ అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, May 11, 2022, 8:45 [IST]
Other articles published on May 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+