Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రాడ్‌కు ఓ పీడకల!: యువీ 6 బంతుల్లో 6 సిక్సులు బాది నేటికి 12 ఏళ్లు!

 Yuvraj Singh 6 Sixes: 12 years ago, Indias No. 12 smashed Stuart Broad all across the stadium

హైదరాబాద్: యువరాజ్ సింగ్ అనగానే సగటు భారత అభిమానికి ఠక్కున గుర్తుకు వచ్చేది 6 బంతుల్లో 6 సిక్సులు బాదిన క్రికెటర్ అని. అంతేకాదు ధోని నాయకత్వంలోని టీమిండియా అటు టీ20 వరల్డ్‌కప్, ఇటు వన్డే వరల్డ్‌కప్‌లను గెలవడంలో కూడా కీలకపాత్ర పోషించాడు.

12 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది పీడకల మిగిల్చాడు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్‌ అనవసరంగా యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించడంతో పాటు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

16 బంతుల్లో 58 పరుగులతో సంచలన ఇన్నింగ్స్

ఈ మ్యాచ్‌లో యువీ 16 బంతుల్లో 58 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (68), గౌతం గంభీర్ (58) అద్భుతమై ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఔటయ్యారు. అనంతరం 19 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు రాబిన్‌ ఊతప్ప(6) ఔటయ్యాక.. కెప్టెన్‌ ధోనీ(10), యువరాజ్‌(58) క్రీజులోకి వచ్చారు. చివరి మూడు ఓవర్లలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించగా యువరాజ్ సింగ్ ఏకంగా 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. 19వ ఓవర్‌ ఐదో బంతికి ఫ్లింటాప్‌ బౌలింగ్‌లో కాలింగ్‌వుడ్‌ చేతికి చిక్కి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.

18 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ధోని సేన 200 పరుగులకే కట్టడి చేయడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ధోని నేతృత్వంలోని టీమిండియా తొలి ఐసీసీ వరల్డ్ టీ20 విజేతగా నిలిచింది.

యువీ ఇన్నింగ్స్ ఓ సెన్సేషన్

యువీ ఇన్నింగ్స్ ఓ సెన్సేషన్

ఈ మ్యాచ్‌లో యువీ ఇన్నింగ్స్ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన నాలుగో క్రికెటర్‌గా యువరాజ్ చరిత్ర సృష్టించాడు. అంతకముందు గ్యారీ సోబర్స్ (వెస్టిండిస్), రవిశాస్త్రి (ఇండియా), గిబ్స్ (దక్షిణాఫ్రికా)లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవే కారణం

ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవే కారణం

తొలి ఇన్నింగ్స్‌లో యువీ బ్యాటింగ్‌ చేస్తుండగా 18వ ఓవర్‌ అనంతరం ఇంగ్లాండ్‌ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ వాగ్వాదానికి దిగాడు. దీంతో రెచ్చిపోయిన యువరాజ్‌ సింగ్... స్టువర్ట్‌బ్రాడ్‌కు చుక్కులు చూపించాడు. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ తాను ఆరు సిక్సులు కొట్టడానికి ఆరోజు మ్యాచ్‌లో ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవే కారణమని యువరాజ్ వెల్లడించాడు.

నీ గొంతు కోస్తానని అన్నాడు

నీ గొంతు కోస్తానని అన్నాడు

ఫ్లింటాఫ్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టానని, అవి చెత్త షాట్లంటూ ఓ బూతు పదం అతను వాడాడని, నేనూ ఓ బూతు తిట్టానని.. దానికి ఏం మాట్లాడావని అతను తనని అడిగాడని, దానికి తాను ఘాటుగానే.. నువ్వు సరిగ్గానే విన్నావని చెప్పానని తెలిపాడు. దీనికి అతడు 'నీ గొంతు కోస్తానని' తనను అన్నాడని యువీ చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన యువీ ఆ తర్వాతి ఓవర్‌లో ప్రతి బంతిని బౌండరీకి దాటించాలని అనుకున్నానని చెప్పాడు.

తొలి బంతికి డీప్‌కవర్‌లోకి సిక్స్‌

తొలి బంతికి డీప్‌కవర్‌లోకి సిక్స్‌

తొలి బంతికి డీప్‌కవర్‌లోకి సిక్స్‌ కొట్టిన యువీ తర్వాతి బంతిని బ్యాక్‌వర్డ్‌పాయింట్‌ దిశగా తరలించాడు. మూడో బంతి డీప్‌ మిడ్‌ఆన్‌లో వెళ్లగా నాలుగో బంతి డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో దూసుకెళ్లింది. ఐదో బంతిని స్వీప్‌షాట్‌తో తరలించి ఆఖరి సిక్స్‌ను లాంగ్‌ ఆఫ్‌లో తరలించాడు. దీంతో ఐసీసీ నిర్వహించిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో తొలిసారి ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాదిన తొలి క్రికెటర్‌గా యువరాజ్ సింగ్ నిలిచాడు.

200 పరుగులు చేసిన ఇంగ్లాండ్

200 పరుగులు చేసిన ఇంగ్లాండ్

అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగులతో గెలుపొందింది. డారెన్‌ మ్యాడీ(29), విక్రమ్‌సోలంకి(43) శుభారంభం చేయగా కెవిన్‌ పీటర్‌సన్‌(39), కాలింగ్‌వుడ్‌(28) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. చివర్లో ఓవైస్‌ షా(21), లూక్‌రైట్‌(16) పోరాడినప్పటికీ ఇంగ్లాండ్ ఓడిపోయింది.

Story first published: Thursday, September 19, 2019, 13:55 [IST]
Other articles published on Sep 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+