43 ఏళ్ల వయసులో యూవీ అన్‌స్టాపబుల్.. భయపడిపోయిన ప్రత్యర్థి బ్యాటర్లు! (వీడియో వైరల్)
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో మరోసారి దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్ మెరిసింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మాస్టర్స్ పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ఈ లీగ్ లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. రాహుల్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ తన అన్ స్టాపబుల్ ఎనర్జీతో ప్రత్యర్థి బ్యాటర్లను భలే బోల్తా కొట్టించాడు. వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
2 వికెట్లు కోల్పోయి...
86 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా జట్టు 11 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మొత్తం 89 పరుగులు చేసింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ (8 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 6 పరుగులు), ఇర్ఫాన్ పఠాన్ (12 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 13 పరుగులు) విఫలమయ్యారు. అంబటి రాయుడు (34 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 41 నాటౌట్), పవన్ నేగి (12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 21 నాటౌట్) రాణించారు. దీంతో ఇండియా మాస్టర్స్ లక్ష్యాన్ని ఈజీగానే ఛేదించింది. థాండి షబాలా, ఎడ్డి లీ తలో వికెట్ తీశారు.

రాహుల్, యూవీ జోరు..
అంతకుముందు రాహుల్ శర్మ (3/18), యువరాజ్ సింగ్ (3/12) చెరో మూడు వికెట్లతో, పవన్ నేగి (2/21), స్టువర్ట్ బిన్నీ (2/1) తలో రెండు వికెట్లతో విజృంభించడం వల్ల సౌతాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలో 85 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రీ డేవిడ్స్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 38 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. డేన్ విలాస్ (15 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 21 పరుగులు), ఆమ్లా (9), బెహార్డిన్ (9), షబాలా (1), టినీ, ఎడ్డీ లీ అందరూ విఫలమయ్యారు.
Yuvi’s 𝓼𝓹𝓮𝓵𝓵 🪄 = trouble for the opposition batters ⚡️
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 1, 2025
2️⃣ wickets, unstoppable energy and a game-changing over! Watch his magic unfold at the #IMLT20 🤩🔥#TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/6bKdxUGMnF
యువరాజ్ సింగ్ మాయ..
43 ఏళ్ల వయసులోనూ యువరాజ్ సింగ్ (3/12) ప్రదర్శన చూసి క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. అతడు తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థులను అద్భుతంగా ఇబ్బంది పెడుతున్నాడని కొనియాడుతున్నారు. యూవీ అన్ స్టాపబుల్ ఎనర్జీ, అతడి గేమ్ ఛేంజింగ్ ఓవర్ తో ఇండియా మాస్టర్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుందని అంటున్నారు. ఈ మ్యాచ్ లో అతడు 2 బంతుల్లో 2 కీలక వికెట్లు తీశాడు. వెర్నర్ ఫిలాండర్, క్రూగర్ వెంటవెంటనే పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత డేన్ విలాస్ వికెట్ ను తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications