18 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ధోని సేన 200 పరుగులకే కట్టడి చేయడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ధోని నేతృత్వంలోని టీమిండియా తొలి ఐసీసీ వరల్డ్ టీ20 విజేతగా నిలిచింది.

యువీ ఇన్నింగ్స్ ఓ సెన్సేషన్
ఈ మ్యాచ్‌లో యువీ ఇన్నింగ్స్ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన నాలుగో క్రికెటర్‌గా యువరాజ్ చరిత్ర సృష్టించాడు. అంతకముందు గ్యారీ సోబర్స్ (వెస్టిండిస్), రవిశాస్త్రి (ఇండియా), గిబ్స్ (దక్షిణాఫ్రికా)లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవే కారణం
అయితే ఐసీసీ నిర్వహించిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో తొలిసారి ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాదిన తొలి క్రికెటర్ మాత్రం యువీనే. ఓ కార్యక్రమంలో తాను ఆరు సిక్సులు కొట్టడానికి ఆరోజు మ్యాచ్‌లో ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవే కారణమని యువరాజ్ వెల్లడించాడు.

నీ గొంతు కోస్తానని అన్నాడు
ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టానని, అవి చెత్త షాట్లంటూ ఓ బూతు పదం అతను వాడాడని, నేనూ ఓ బూతు తిట్టానని.. దానికి ఏం మాట్లాడావని అతను తనని అడిగాడని, దానికి తాను ఘాటుగానే.. నువ్వు సరిగ్గానే విన్నావని చెప్పానని తెలిపాడు. దీనికి అతడు 'నీ గొంతు కోస్తానని' తనను అన్నాడని యువీ చెప్పాడు.

యువరాజ్ ఆరు సిక్సులు బాదాడిలా
దీంతో కోపంతో ఊగిపోయిన యువీ ఆ తర్వాతి ఓవర్‌లో ప్రతి బంతిని బౌండరీకి దాటించాలని అనుకున్నానని చెప్పాడు. ఒకే ఓవర్‌లో యువరాజ్ ఆరు సిక్సులు కొట్టిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. యువీ సిక్సులను బాదాడిలా:
Ball 1: A half-volley around the off-stump. Six over the cow corner.
Ball 2: A mere flick of his wrist send the ball soaring over backward square leg.
Ball 3: Half-volley outside the off-stump and the ball disappeared over long-off and cover.
Ball 4: Broad is rattled and struggling to find the right length. He came around the wicket and this one was a full toss and Yuvraj smashed it over backward point.
Ball 5: Broad switched to over the wicket. But a juicy full ball was slog swept over midwicket.
Ball 6: Broad erred in length again and Yuvraj hammered the ball over mid-wicket again. History is made.


Click it and Unblock the Notifications











