
ధోని అంతర్గత రాజకీయాలు..
ధోని కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మరుక్షణం యువరాజ్ సింగ్ జట్టులోకి వస్తాడని తాను రెండేళ్ల క్రితమే చెప్పానని యోగ్ రాజ్ గుర్తుచేశారు. ' నిజాయితీగా మాట్లాడుకుందాం.. ఈ విషయం గురించి నేను గతంలో చెప్పానా? లేదో.. ఒక్కసారి నా గత ఇంటర్వ్యూల్లోకి వెళ్లి చూడండి. ధోనికి యువరాజ్ అంటే పడదు.టీమ్ లోని అంతర్గత రాజకీయాలే అందుకు కారణ. నేనూ ఆడాను టీమ్ ఇండియా తరుపున. ఆ పాలిటిక్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు' అంటూ యోగ్ రాజ్ ధోనిపై విమర్శలు గుప్పించారు.

ధోని ఎన్నడూ యువీని అర్థం చేసుకోలేదు..
'విరాట్ కోహ్లి కెప్టెన్సీ చేపట్టిన తర్వాత సీన్ మారిపోయింది. దేశవాళీ మ్యాచుల్లో యువరాజ్ ప్రతిభను కోహ్లి విస్మరించలేడు. యువరాజ్ అన్ని ఫార్మాట్లకు ఆడగల సమర్థుడు. ధోని ఎప్పటికీ ఈ విషయం అర్థం చేసుకోలేడు. కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడు' అని యోగ్ రాజ్ చెప్పారు.

యువీతో అలా చెప్పాను:
'గతేడాది మే నెలలో నేను యువరాజ్ తో చెప్పాను. ఇండియన్ టీమ్ లో నిన్నెవరూ సపోర్ట్ చేయరు. నువ్వు చేయాల్సిందల్లా నీ ఆటపై ఫోకస్ చేయడమే, నువ్వు చేయగలవు కూడా అని చెప్పాను. దానికి అనుగుణంగానే యువరాజ్ ఆటపై ఫోకస్ చేశాడు'.
'ఫలితం ఇప్పడు కళ్లెదుట కనిపిస్తోంది. ధోని ఏదో రోజు రిటైర్డ్ అవుతాడు.. ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని యువీతో చెప్పాను. అయితే యువీ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అనుకుంటాడు మా డాడీ చెప్పిందే నిజమే అని' యోగ్ రాజ్ చేసిన వ్యాఖ్యలివి.

ధోని 'రావణ్'..
గత వరల్డ్ కప్ లో భారత్ పాక్ ను ఓడించిన తర్వాత ధోనిని యోగ్ రాజ్ రావణ్ తో పోల్చిన సంగతి తెలిసిందే. అదే విమర్శను తాజాగా మళ్లీ ప్రస్తావించారు.'రావణుడి పాలన ముగిసిపోయింది. అలాగే ధోని నాయకత్వం కూడా ముగిసిపోయింది. చూద్దాం.. ఇప్పుడీ ఇద్దరిలో ఎవరూ టాప్ లో నిలుస్తారో!..' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ధోని అహంకారం :
ధోని బ్యాటింగ్ గురించి ప్రస్తావిస్తూ.. ధోని బ్యాటింగ్ సత్తా తగ్గిపోయిందని తాను భావిస్తున్నట్టుగా యోగ్ రాజ్ తెలిపారు. తొలినాళ్లలో ఆడినట్టుగా ధోని ఇప్పుడు ఆడలేడని, అతని అహంకారం ఇక బద్దలైపోతుందని యోగ్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఇక యువీ గురించి చెప్పుకొస్తూ.. యువీ బ్యాటింగ్ ను ఉపయోగించుకోవడం విషయంలో ధోని చేసిన తప్పిదాలను కోహ్లి చేయడని తాను భావిస్తున్నట్టుగా యోగ్ రాజ్ చెప్పారు. యువీ బౌలర్ గా కూడా రాణిస్తాడు కాబట్టి.. కోహ్లి దాన్ని బాగా వాడుకోవాలని సూచించాడు.


Click it and Unblock the Notifications











