Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దురంహకారి, అడుక్కుతినే పరిస్థితి వస్తుంది: ధోనీపై యువీ తండ్రి యోగ్‌రాజ్ ఫైర్

న్యూఢిల్లీ: ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ టెస్ట్ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ మరోసారి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ధోనీ ఓ దురంహకారి అని మండిపడిన యోగ్‌రాజ్, రామాయణంలో రావణుడిలాండి వాడని అన్నారు.

తన కొడుకు మంచి ఫాంలో ఉన్నప్పటికీ 2015 ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించలేదని, అందుకు ధోనీ కూడా కారణమని ఇంతకుముందు ఓసారి యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 'ఇండియా న్యూస్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్.. ధోనీపై మరో తీవ్ర ఆరోపణలు చేశారు.

Yuvraj's dad blasts 'arrogant' Dhoni, says captain will 'suffer' and become 'penniless'

'ధోనీ భయంకరమైన వ్యక్తి. కొద్ది రోజుల తర్వాత రామాయణంలో రావణుడిలా అతడు బాధపడతాడు' యోగ్‌రాజ్ పేర్కొన్నాడు. మీడియా కారణంగా ధోనీ క్రికెట్లో దేవుడయ్యాడనీ.. ఒకవేళ తానే జర్నలిస్టు అయితే ధోనీ చెంప ఛల్లుమణిపంచేవాడినని అన్నారు.

అంతేగాక పలు శాపనార్థాలు కూడా పెట్టారు. ధోనీ భవిష్యత్తులో నిరుపేదగా మారి అడుక్కుతినే పరిస్థితి వస్తుందని అన్నారు. కాగా, ధోనీ, యువరాజ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 కోసం సిద్ధమవుతున్నారు. యువరాజ్ సింగ్‌ని రూ. 16కోట్లు వెచ్చించి ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగులో చేసిన విషయం తెలిసిందే. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+