నెదర్లాండ్‌పై భారత్ విజయం: క్వార్టర్‌కు సులభం చేసిన యూవీ

లక్ష్యఛేదనలో భారత బ్యాట్స్‌మెన్ కొద్దిగా తడబాటుకు లోనయ్యారు. అయితే యువీ ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి ఆల్‌రౌండ్ షోతో విజృంభించడంతో భారత్ అతిసులువుగా గెలిచింది. యువరాజ్ సింగ్ మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో భారత్ పసికూన నెదర్లాండ్స్‌పై ఐదు వికెట్లతో గెలుపొందింది. బుధవారం ఇక్కడి ఫిరో జ్ షా కోట్లా మైదానం లో జరిగిన 190 పరుగుల స్వల్ప లక్ష్యం తో బరిలోకి దిగిన ధోనీసేన 36.3 ఓ వర్లలో ఐదు వికె ట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తాజా విజయంతో భారత్ గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, నెదర్లాండ్స్‌కి ది వరసగా నాలుగో పరాజయం.
సెహ్వాగ్ 39, సచిన్ 27) శుభారంభాన్నందించారు. అయితే భారత్ ఓ దశలో వెంటవెంటనే వికెట్లు చేజార్చుకోవడంతో పసికూన చేతిలో చెమటోడ్చాల్సి వచ్చిం ది. యువీ హాఫ్ సెంచరీతో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించా డు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 46.4 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. బోరెన్ అత్యధికంగా 38 పరుగు లు చేశాడు. జహీర్ మూడు, యువరాజ్, చావ్లా రెండేసి వికెట్లు పడగొట్టారు. యువరాజ్ సింగ్ ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. గంభీర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 40, ధోనీతో ఆరో వికెట్‌కు అభేద్యమైన 52 పరుగులు జోడించాడు. 37వ ఓవర్లో యువీ ఫోర్ బాది భారత విజయాన్ని పరిపూర్ణం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications