యువీ 169, గంగూలీ 125 నాటౌట్ -భారత్ 365/5
యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీలు సెంచరీలు సాధించడంతో పాకిస్తాన్ తో బెంగుళూరులో జరుగుతున్న ఆఖరుదైన మూడో టెస్ట్ లో భారత్ జట్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి అయిదు వికెట్లు నష్టపోయి 365 పరుగులు సాధించింది. ఒక దశలో 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాలలో కూరుకుపోయిన భారత జట్టును యువీ, దాదా జోడీ ఆదుకుంది. వీరిద్దరూ అయిదవ వికెట్ భాగస్వామ్యంలో సరిగ్గా 300పరుగులు జోడించారు. 169 పరుగులు చేసిన యువరాజ్ 202 బంతులలో 28 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి ఈ స్కోరును సాధించాడు. 300 పరుగులు జోడించామని ఉత్సాహంతో గంగూలీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే యువరాజ్ సింగ్, సమీ బౌలింగ్ లో ఫైసల్ ఇక్బాల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నాటౌట్ ఉన్న గంగూలీ 214 బంతులలో 20 ఫోర్లతో 125 పరుగులు చేశాడు.అంతకుముందు జాఫర్(17), గంభీర్(5), ద్రవిడ్(19), వివిఎస్ లక్ష్మణ్(5) వెంటవెంటనే అవుటయ్యారు. యాసిర్ అరాఫత్ మూడు, సమీ రెండు వికెట్లు కైవసం చేసుకున్నారు.
Story first published: Saturday, December 8, 2007, 23:53 [IST]
Other articles published on Dec 8, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications