
ఐదు మ్యాచ్‌ల్లో ఆడింది కేవలం ఒకదానిలోనే
ఈ రంజీ సీజన్‌లో పంజాబ్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదానిలోనే మాత్రమే ఆడాడు. విదర్భతో జరిగిన ఆ మ్యాచ్‌లో యువరాజ్ 20, 42 పరుగులు చేశాడు. మిగతా మ్యాచ్‌లకు యువీ దూరంగా ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి యువరాజ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కనిపించడంతో బీసీసీఐ అధికారులు కంగుతిన్నారు. నిజానికి గాయంతో ఉన్న ఆటగాళ్లు కోలుకునేందుకు ఎన్‌సీఏకు వస్తుంటారు. ఎలాంటి గాయాలు లేకపోయినా ఎన్‌సీఏలో యువరాజ్ ఫిట్‌నెస్ శిక్షణలో పాల్గొంటుండడాన్ని బోర్డు సీనియర్ అధికారి ఒకరు ప్రశ్నించారు.

యో-యో పరీక్ష పాసయ్యే లక్ష్యంతోనే
అయితే యువరాజ్ ఎన్‌సీఏలో దర్శనమివ్వడానికి సెలక్టర్లు చెప్పిన కారణమేనని అంటున్నారు. యో-యో ఫిట్‌నెస్ పరీక్షను యువీ అధిగమించకపోవడం వల్లే అతడు జట్టులో చోటు కోల్పోయాడని సెలక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఆ పరీక్ష పాసయ్యే లక్ష్యంతోనే ఎన్‌సీఏలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.

శ్రీలంతో జరిగే మూడు వన్డేల సిరిస్‌కు అందుబాటులో
ఈ నేపథ్యంలో యో-యో పరీక్షను ఎదుర్కొనేందుకు కావాల్సిన కసరత్తులు చేసి... ఆ పరీక్షలో నెగ్గి సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండాలనేది యువీ కోరిక కాబోలు. దీంతో గత కొన్ని నెలలుగా మైదానానికి దూరంగా ఉండటంతో పాటు ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ దృష్టిని సారించాడు. ఒకవేళ అతను యోయో పరీక్షలో పాసైనప్పటికీ సెలక్టర్లు జట్టులో చోటిస్తారా? అన్నది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జట్టులో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.

యువరాజ్ తీరుపై బీసీసీఐ అసంతృప్తి
మరోవైపు యువీ ఎన్‌సీఏలో శిక్షణ పొందడంపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ 'గాయం నుంచి కోలుకున్నట్లు ఎలాంటి నివేదికలు లేవు. అతను యోయో పరీక్ష కోసమే ఎన్‌సీఏకు వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు డుమ్మా కొట్టడం ఎంత వరకు సమంజసమో యువీకి తెలియాలి? పరుగులు చేయకుండా ఫిట్‌నెస్ పరీక్షలో మాత్రమే నెగ్గితే శ్రీలంక సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తారా? ఇషాంత్ భారత జట్టులో సభ్యుడైనప్పటికీ.. తుది జట్టులో చోటు దక్కకపోవడంతో రంజీ మ్యాచ్ ఆడేందుకు పంపారు. సెలక్టర్లు దేశవాళీ ప్రదర్శనను అంత కీలకంగా భావిస్తారు' అని అన్నాడు.


Click it and Unblock the Notifications











