ముంబై ఇండియన్స్ యువరాజ్‌ను రూ.కోటికే దక్కించుకోవడానికి కారణం..?


న్యూఢిల్లీ: ఐపీఎల్ 12వ సీజన్‌కు సంబంధించి జైపూర్ వేదికగా వేలం నిర్వహించింది బీసీసీఐ. వేలం మొత్తంలో అనూహ్యంగా కుర్రాళ్లకే ఎక్కువ ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డిసెంబరు 18న మధ్యాహ్నం 3:30గంటలకు మొదలైన వేలం ఆరు గంటలపాటు జరిగింది. ఈసారి వేలం ప్రక్రియను హ్యూస్ ఎడ్ మెయిడాస్ నిర్వహించారు. 13దేశాలకు చెందిన ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ వేలంలోకి 351 మందిని ఉంచింది. ఇందులో ఎనిమిది ఫ్రాంచైజీలు 60 మంది స్వదేశ ఆటగాళ్లను 20 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆకాశ్ అంబానీ
యువీ తొలి రౌండ్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. రెండో రౌండ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రూ.కోటి (బేస్ ధర)కి కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ముంబై ఇండియన్స్ నిర్ణయంపై యువీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువరాజ్ కొనుగోలు చేయడంపై ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఐపీఎల్ చరిత్రలో తమ కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నాడు. యువరాజ్ లాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలని ఎన్నో సీజన్లుగా అనుకుంటున్నామని ఇప్పటికి సాధ్యపడిందని పేర్కొన్నాడు.

యువీ.. మలింగలకు భారీ మొత్తంలో
తొలి రౌండ్ నుంచి ఎవ్వరూ కొనుగోలు చేయకుండా పట్టించుకోని యువరాజ్‌ను ముంబై ఆఖరి క్షణాల్లో కొనుగోలు చేసుకుంది. దీనిపై మాత్రం ఆకాశ్ అంబానీ.. యువరాజ్, మలింగలకు భారీ మొత్తంలో కేటాయించాలని నిర్ణయించుకన్నాం. యువరాజ్ బ్యాటింగ్ శైలి మాకెంతో నచ్చుతుంది. ఇంతకుముందు సీజన్లలో సొంతం చేసుకుందామని భావించినా మా దగ్గర ఉన్న మొత్తం అతనికి సరిపోయేంత లేకపోవడంతో దక్కించుకోలేకపోయాం.

యువీ, మలింగలో కొన్ని ప్రత్యేకతలు
‘నిజాయతీగా చెప్పాలంటే.. యువీ, మలింగ కోసం మేం ఎక్కువ బడ్జెట్ కేటాయించాం. యువీలాంటి ఆటగాడు కోటి రూపాయలకే మాకు దక్కడం బహుశా ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద దొంగతనం. అతడు గెలవాల్సిన టోఫ్రీలన్నీ గెలిచాడు. అనుభవం ఉన్న ఆటగాళ్లతోపాటు కుర్రాళ్లపై కూడా దృష్టి పెట్టాం. యువీ, మలింగలో కొన్ని ప్రత్యేకతలను గుర్తించామని ఆకాశ్ పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications