Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీ లవ్ సీక్రెట్స్ : ఆమె కోసం మూడేళ్లు అష్టకష్టాలు

ముంబై : డిసెంబర్ లో బ్యాచులర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్న టీమ్ ఇండియా క్రికెటర్ యువీ.. తన ప్రేమ కష్టాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇప్పటికే తన ప్రియురాలు, నటి హేజెల్ కీచ్ తో యువీకి సీక్రెట్ గా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

హేజెల్ తో పరిచయం.. ఆపై తనను ప్రేమ ప్రేమించడానికి హేజెల్ తో పడ్డ కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో సరదాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు యువీ. యువీకి హేజెల్ కు కామన్ ఫ్రెండ్ అయిన ఓ స్నేహితుడి ద్వారా తమ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్టు తెలిపాడు యువీ. అయితే హేజెల్ ను వ్యక్తిగతంగా కలవడానికి మాత్రం సంవత్సరం పాటు ఎదురుచూపులు తప్పలేదట.

yuvi

పరిచయం అయిన సంవత్సరం.. మొత్తానికి ఎలాగోలా హేజెల్ ను కలిశాడు యువీ. ఆపై తనతో మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో ఓసారి కాఫీ తాగడానికి రమ్మని హేజెల్ ను పిలిచాడట యువీ. అడిగినప్పుడు ఓకె చెప్పిన హేజెల్ తీరా టైమ్ కు హ్యాండిచ్చేసిందంట. కారణమేంటో తెలుసుకుందామని ఫోన్ చేసినా.. హేజెల్ మైబైల్ స్విచ్చాఫ్. ఇలా హేజెల్ ను కాఫీ డేట్ కు, ఆపై ప్రేమకు ఒప్పించడానికి మూడేళ్ల పాటు అష్టకష్టాలు పడ్డాడట యువీ.

అయితే హేజెల్ తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే విషయం నేరుగా ఇంట్లో చెప్పేశాడట. వాళ్లు కూడా ఓకె చెప్పేయడంతో.. డిసెంబర్ మొదటివారంలో యువీ పెళ్లి ఖాయమైంది. కాగా, వివాహం ఢిల్లీ జరగనుండగా.. హేజెల్ తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ వాసులు కావడంతో.. వారి సాంప్రదాయాల ప్రకారమే వివాహం జరగనున్నట్లు సమాచారం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+