Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి హిట్ వికెట్‌గా యువీ: సచిన్‌కు పాదాభివందనం

హైదరాబాద్: ఐపీఎల్ 9వ ఎడిషన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన గెలుపు జోరుని కొనసాగిస్తోంది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు 85 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై భారీ విజయం సాధించింది.

ఈ సీజన్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తొలు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 177 పరుగులు చేసింది. ఆ తర్వాత 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ 9వ ఎడిషన్‌లో తొలి హిట్‌ వికెట్‌ నమోదైంది.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ బంతిని వెనక్కి వెళ్లి ఆడబోయి పొరపాటున బ్యాట్‌తో వికెట్లను తాకించాడు. గాయం నుంచి కోలుకుని తాజా సీజన్‌లో రెండో మ్యాచ్‌ ఆడిన యువరాజ్‌ సింగ్‌ (39: 23 బంతుల్లో 3×4, 2×6) ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి మూడో వికెట్‌కి 8.1 ఓవర్లలోనే ఏకంగా 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేసిన మెక్లెనగన్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికి యువరాజ్‌సింగ్‌ హిట్‌ వికెట్‌గా వెనుదిరగడంతో అభిమానులు నిరాశ చెందారు. ముంబై ఇండియ్స్ హోం గ్రౌండ్‌గా విశాఖను ఎంచుకున్న తొలి మ్యాచ్‌లోనే ముంబై ఓటమి పాలైంది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డుని ఆశిష్ నెహ్రా అందుకున్నాడు.

సచిన్ ఆశీర్వాదం:

సచిన్ టెండూల్కర్ అంటే యువరాజ్ సింగ్‌కు ఎనలేని గౌరవం. యువీని సచిన్ కూడా అంతే అభిమానిస్తాడు. విశాఖలో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ మెంటార్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడు యువరాజ్ సింగ్ పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

హైదరాబాద్ జట్టుకు యువీ ప్రాతనిధ్య వహిస్తుండగా, ముంబై ఇండియన్ జట్టుకు మెంటార్‌గా సచిన్ వ్వవహారిస్తున్నాడు. వైజాగ్‌లో ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం యువీ సచిన్ వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాడు. ఈ మ్యాచ్ యువీకి వందో మ్యాచ్ కావడం విశేషం.

తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో ధావన్‌ అర్ధ సెంచరీతో రాణించడంతో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వార్నర్‌ (48), యువరాజ్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) పరుగులు చేశారు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌-డేవిడ్‌ వార్నర్‌ జట్టుకు మంచి ప్రారంభ స్కోరుని అందించారు

 తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

ఆరంభం నుంచే వార్నర్‌ భారీ షాట్లతో ముంబై బౌలర్లపై విరుచుకు పడ్డాడు. మరో ఎండ్‌లో ధవన్‌ కూడా ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. ఇన్నింగ్స్‌ తొలి బంతినే వార్నర్‌ బౌండ్రీ బాదాడు. హర్భజన్‌ వేసిన నాలుగో ఓవర్లలోనూ అతను 6, 4తో అలరించాడు. ఇక మెక్లెనగన్‌ బౌలింగ్‌లోనూ వార్నర్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.

తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

చివరికి భజ్జీ వేసిన పదో ఓవర్లో 4, 4 బాదిన డేవిడ్‌.. అదే ఊపులో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత విలియ మ్సన్‌ (2) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కాగా, 17వ ఓవర్లో ధవన్‌ మూడు ఫోర్లు బాది 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత బు మ్రా బౌలింగ్‌లోనే శిఖర్‌ 6,4తో జోరు ప్రదర్శించాడు.

 తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

లక్ష్య చేధనలో పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ముంబై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పేసర్‌ నెహ్రా నిప్పులు చెరగడంతో టాపా అర్డర్ కుప్పకూలింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ పార్థివ్‌ (0)ని భువనేశ్వర్‌ డకౌట్‌ చేసి.. వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. తర్వాతి ఓవర్లో తొలి బంతికే కెప్టెన్‌ రోహిత శర్మ (5)ను నెహ్రా పెవిలియన్‌ చేర్చాడు.

తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

తొలి హిటి వికెట్‌గా యువీ: సచిన్ ఆశీర్వాదం

మళ్లీ 4వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన నెహ్రా.. వరుసగా రాయుడు (6), జోస్‌ బట్లర్‌ (2)ను అవుట్‌ చేసి.. ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. భారీ అంచనాలున్న పొలార్డ్‌ (11) అవుట్‌ కావడంతో ముంబై ఓటమి ఖాయమైంది. తర్వాత హార్దిక్‌ పాండ్యా (7), మెక్లెనగన్‌ (8)ని ముస్తాఫిజుర్‌ బలి తీసుకున్నా డు. ఇక బుమ్రా (6) చివరి వికెట్‌గా అవుట్‌ కావడంతో ముంబై ఓటమి పాలైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+