Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: 'ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ బ్యాటర్ 'అతడే'.. ఇక వాళ్లకి డేంజరే!'

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. ఫిబ్రవరి 23న తలపడనుంది. ఈ నేపథ్యంలో పాక్ పై భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందా? మరీ ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ ఎలాంటి ఆడతారా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ గురించి ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్, ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్, టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాట్లాడారు.

ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ బ్యాటర్ రోహితే..
ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ట్రావిస్ హెడ్ ను... '2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బెస్ట్ బ్యాటర్ ఎవర'ని అడగగా... 'రోహిత్ శర్మ'నే అని సమాధానం ఇచ్చాడు. అదే సమయంలో జోస్ బట్లర్ మాట్లాడుతూ.. "రోహిత్ డెడికేషన్, కష్టపడే తత్వం, టీమ్ మేట్స్ తో అతడు ఉండే విధానాన్ని నేను ఎంతగానో ఇష్టపడతాను" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

yuvaraj singh Travis Head Jos buttler says Champions trophy 2025 best bater Rohit sharma

వాళ్లకు యమా డేంజర్..
రోహిత్ గురించి యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "రోహిత్ ఇబ్బంది పడుతూనే పరుగులు చేస్తే అది ప్రత్యర్థి జట్టుకు మరింత ప్రమాదకరం. అతడు ఫామ్ లో ఉన్నా లేకపోయినా అది నాకు పెద్ద మ్యాటర్ కాదు. నేనెప్పుడు మా మ్యాచ్ విన్నర్స్ కు మద్దతుగా నిలుస్తాను. వన్డే క్రికెట్ లో ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మాట్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ బ్యాట్స్ మెన్ రోహిత్. కాబట్టి రోహిత్ ఇబ్బంది పడుతూనే పరుగులు చేస్తే అతడు అపోజిషన్ కు చాలా డేంజర్." అని చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ పై రోహిత్ రికార్డ్
పాకిస్థాన్ పై రోహిత్ కు మంచి రికార్డ్ ఉంది. 19 వన్డేల్లో 51.35 యావరేజ్ తో, 92.38 స్ట్రేక్ రేట్ తో 873 పరుగులు చేశారు. అందులో 2 సెంచరీలు, 8 అర్ధ శతాలు బాదాడు. అందులో అత్యధిక స్కోరు 140.

Story first published: Saturday, February 22, 2025, 16:53 [IST]
Other articles published on Feb 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+