For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువీ ఆవేదన: యో-యో టెస్టు పూర్తిచేసినా జట్టులో అవకాశం ఇవ్వలేదు.. జీవితంలో అదే కీలక మలుపు

Yuvaraj Singh said Being dropped despite passing Yo-Yo test was unfair


ముంబై:
యో-యో టెస్టు పూర్తిచేసినా జట్టులో అవకాశం ఇవ్వలేదు. టీమిండియాలో ఇలా జరగడం సరికాదు అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసాడు. యో-యో టెస్టు నా జీవితంలో కీలక మలుపు అని యువీ పేర్కొన్నాడు. టీమిండియా యో-యో టెస్టును ప్రామాణికంగా పెట్టిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు అందరూ యో-యో టెస్టులో నెగ్గితేనే జట్టులోకి వస్తారు. గత రెండు మూడేళ్ళుగా టీమిండియా ఇదే ఫాలో అవుతోంది.
 యో-యో టెస్టు పూర్తిచేసినా అవకాశం ఇవ్వలేదు:

యో-యో టెస్టు పూర్తిచేసినా అవకాశం ఇవ్వలేదు:

తాజాగా యువరాజ్ మాట్లాడుతూ... ' 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత నేను ఆడిన 8-9 మ్యాచ్‌ల్లో రెండు సార్లు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనా.. జట్టు నుంచి నన్ను తప్పిస్తారని అస్సలు ఊహించలేదు. 36 ఏళ్ల వయసులో యో-యో టెస్టులో పాస్ అవుతానని జట్టు యాజమాన్యం భావించలేదు. యోయో టెస్టు పూర్తిచేసినా జట్టులో నాకు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గాయమైనప్పుడు శ్రీలంకతో సిరీస్‌కు సన్నద్ధమవ్వాలని యాజమాన్యం తెలిపింది. అప్పుడే యోయో టెస్టు అమల్లోకి వచ్చింది' అని గుర్తు చేశాడు.

జీవితంలో అదే కీలక మలుపు:

జీవితంలో అదే కీలక మలుపు:

'36 ఏళ్ల వయసులో యో-యో టెస్టు పాస్‌ కాలేనని భావించిన యాజమాన్యం, ఆ కారణంతో తనని పక్కనపెట్టాలని భావించింది. టెస్ట్ పూర్తిచేసినా దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాలని చెప్పారు. యో-యో నా జీవితాన్ని మలుపు తిప్పింది' అని యువీ తెలిపాడు. 'జట్టులో యువకులకు అవకాశాలివ్వాలనుకుంటున్న విషయాన్ని జట్టు యాజమాన్యం నాతో చర్చించలేదు' అని యువీ పేర్కొన్నాడు.

 టీమిండియాలో ఇలా జరగడం సరికాదు:

టీమిండియాలో ఇలా జరగడం సరికాదు:

'యువకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయాన్ని సీనియర్‌ క్రికెటర్లు సెహ్వాగ్‌, జహీర్‌ ఎవ్వరూ ప్రస్తావించలేదు. టీమిండియాలో ఇలా జరగడం సరికాదు. ఈ విషయంలో నాకు నేను సమర్థించుకొని, అన్నింటికీ సమయమొస్తుందని భావించా' అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

వేగవంతమైన అర్ధ సెంచరీ:

వేగవంతమైన అర్ధ సెంచరీ:

19 సెప్టెంబరు 2007న యువీ తన కెరిర్‌లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో ఆరు బంతులనూ స్టాండ్స్‌లోకి పంపి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన యువీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

Story first published: Friday, September 27, 2019, 11:19 [IST]
Other articles published on Sep 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+