
ప్రణాళిక పేపర్‌తో దాదా
2005 ఏప్రిల్‌లో కొచ్చీ వేదికగా పాకిస్థాన్‌తో భారత్ వన్డే మ్యాచ్ ఆడాల్సి ఉంది. మ్యాచ్ కోసం సిద్ధం చేసుకున్న ప్రణాళిక పేపర్‌తో కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అడుగుపెట్టాడు. వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా సహా ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అందరూ అక్కడే ఉన్నారు. ప్రతిఒక్కరు మౌనంగా ఉండడంతో.. డ్రెస్సింగ్ రూమ్ నిశ్శబ్దంగా మారింది.దీంతో కెప్టెన్ గంగూలీ తన ప్లాన్ వివరించడం మొదలుపెట్టాడు.

అయోమయంలో కెప్టెన్
దాదా తన ప్లాన్ చెపుతుండగా.. ఆటగాళ్లు గంగూలీకి ఓ న్యూస్ పేపర్ చూపించారు. అది రాత్రికి రాత్రే ఆటగాళ్లు సిద్ధం చేయించిన పేపర్ అది. అందులో జట్టు ఆటగాళ్లను విమర్శిస్తూ.. దాదా ఇంటర్వ్యూ ఉంది. దీన్ని చూసిన కెప్టెన్ ఒక్కసారిగా షాకయ్యాడు. అసలేం జరుగుతుందో అర్థంకాక అయోమయంలో పడిపోయాడు. తేరుకున్న తర్వాత యువరాజ్, సెహ్వాగ్, హర్భజన్ వైపు చూశాడు. ప్రతి ఆటగాడి వద్దకు వెళ్లి తాను ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదని, తనకేం తెలియదని గంగూలీ చెప్పడం ప్రారంభించాడు. అయినా ఫలితం లేకపోయింది.

దాదా కళ్లలో నీళ్లు
చివరకు దాదా కళ్లలో నీళ్లు తిరిగాయి. అయినా ఎవరూ అతడి వద్దకు వెళ్లలేదు. ఆ తర్వాత హర్భజన్, నెహ్రా కోపంగా డ్రెస్సింగ్ రూమ్‌లో నుంచి బయటకు వెళ్లారు. దీంతో దాదా భయపడిపోయాడు. కావాలంటే కెప్టెన్సీకి రాజీనామా చేస్తానని అందరితో చెప్పాడు. చివరకు ద్రవిడ్ వచ్చి.. ఇదంతా నిన్ను ఏప్రిల్ ఫూల్‌ను చేయడానికి చేశాం అని చెప్పాడు. దీంతో గంగూలీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత దాదా బ్యాట్ పట్టుకొని డ్రెస్సింగ్‌రూమ్‌లో ఆటగాళ్ల వెంటపట్టాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు అందరూ చాలాసేపటి వరకు కడుపుబ్బా నవ్వుకున్నారు.

ఓపెనింగ్ చేస్తావా అంటూ గంగూలీ జోక్
2000 సంవత్సరంలో కెన్యాతో అరంగేట్రం మ్యాచ్‌లోనే యువరాజ్‌ను ఓపెనింగ్ చేస్తావా అని గంగూలీ ముందు రోజు ఆడిగాడట. అందుకు భయంతోనే యువీ సరేనని చెప్పినా.. తర్వాతి రోజు జోక్ చేశానని దాదా అన్నాడు. దానికి ప్రతీకారంగానే 2005లో గంగూలీని ఆటపట్టించేందుకు యువీ మాస్టర్‌ప్లాన్ అమలు చేశాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ రోజు ఇచ్చిన పేపర్ లాంటిదే మళ్లీ గంగూలీ చేతిలో ఆటగాళ్లు పెట్టారట. అయితే దాంట్లో అందరి సంతకాలతో పాటు.. 'దాదా ఐ లవ్ యూ' అని రాసి ఉంది. ఆ తర్వాత ఆటగాళ్లందరినీ గంగూలీ కౌగిలించుకున్నాడట.


Click it and Unblock the Notifications












