Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: సొంత గడ్డకే సిక్సర్ల వీరుడు యువరాజ్, గంభీర్

yuvaraj gambhir ipl

హైదరాబాద్ :ఐపీఎల్‌ 11వ సీజన్‌ కోసం నిర్వహిస్తోన్న వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఆటగాడి కోసం ఎంత ధర వెచ్చించాలో అనే పక్కా ప్రణాళికతో వచ్చిన ఫ్రాంఛైజీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌ను హైదరాబాద్‌ వదిలేసింది.

ఢిల్లీకి డేరింగ్ హీరోస్:
కనీస ధర రూ.2కోట్లతో యువీని పంజాబ్‌ దక్కించుకుంది. ప్లేయర్‌ రిటెన్షన్‌లో గౌతం గంభీర్‌ను అట్టిపెట్టుకోకపోవడంతో కోల్‌కతా అతడ్ని వదిలేస్తుందనే వార్తలొచ్చాయి. అదే నిజం చేస్తూ ఈ రోజు వేలంలో కోల్‌కతా అతడి కోసం ఆర్‌టీఎం వాడలేదు. దీంతో రూ.2.8కోట్లకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ గంభీర్‌ను సొంతం చేసుకుంది.

ఢిల్లీకి మాక్స్‌వెల్:
మ్యాక్స్‌వెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, స్టోక్స్‌, మిచెల్‌ స్టార్క్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. గత ఏడాది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆడిన మ్యాక్స్‌వెల్‌ కోసం ఢిల్లీ vs హైదరాబాద్‌ అనే రీతిలో పోటీ పడ్డాయి. రూ.9కోట్ల వద్ద హైదరాబాద్ వేలం నుంచి తప్పుకుంది. అలాగే రైట్‌ టు మ్యాచ్‌ కార్డును పంజాబ్‌ మ్యాక్స్‌వెల్‌ కోసం ఉపయోగించలేదు. దీంతో రూ.9కోట్లకు దిల్లీ డేర్‌డెవిల్స్‌ అతన్ని సొంతం చేసుకుంది.

* శిఖర్‌ ధావన్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రూ.5.2 కోట్లు

* రవిచంద్రన్‌ అశ్విన్‌ - కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ - కూ.7.6 కోట్లు

* కీరన్‌ పొలార్డ్‌ - ముంబై ఇండియన్స్‌ - రూ.5.4 కోట్లు

* బెన్‌ స్టోక్స్‌ - రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.12.5 కోట్లు

* డూప్లిసిస్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ - రూ.1.6కోట్లు

* అజింక్య రహానె - రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.4 కోట్లు

* మిచెల్‌ స్టార్క్‌ - కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ - రూ.9.4 కోట్లు

* హర్భజన్‌ సింగ్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ - రూ.2 కోట్లు

* షకీబ్‌ ఆల్‌ హాసన్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - రూ.2 కోట్లు

* మ్యాక్స్‌వెల్‌ - దిల్లీ డేర్‌డెవిల్స్‌ - రూ.9 కోట్లు

* గౌతం గంభీర్‌ - దిల్లీ డేర్‌డెవిల్స్‌ - రూ. 2.8 కోట్లు

* డ్వేన్‌ బ్రావో - చెన్నై సూపర్‌ కింగ్స్‌ - రూ.6.4కోట్లు

* కేన్‌ విలియమ్సన్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - రూ.3కోట్లు

* యువరాజ్‌ సింగ్‌ - కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ - రూ.2 కోట్లు

ఇప్పటి వరకు జరిగిన వేలంలో వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌, ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి కనబరచడం గమనార్హం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 27, 2018, 12:51 [IST]
Other articles published on Jan 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+