For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పఠాన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 1230: వికీపీడియా అదే చెప్తోంది

By Nageshwara Rao

హైదరాబాద్: తప్పులు చేయడం మానవ నైజం. అయితే ఆ తప్పు చిన్నదా పెద్దదా? అనేదే ముఖ్యం. సాధారణంగా ఎవరి గురించైనా లేదా ఏదైనా తెలుసుకోవాలంటే మనం వికీపీడియాను ఆశ్రయిస్తుంటాం. అలాంటి వికీపీడీయాలోనే ఈ మధ్యకాలంలో తప్పులు దొర్లుతున్నాయి.

తాజాగా బరోడాకు చెందిన యూసఫ్ పఠాన్‌కి సంబంధించిన క్రికెట్ గణాంకాలల్లో ఓ తప్పు దొర్లింది. వన్డేల్లో పఠాన్ వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేసే క్రమంలో ఆ తప్పు దొర్లింది. యూసఫ్ పఠాన్ అత్యధిక స్కోరుని 123 నాటౌట్‌గా నమోదు చేయడానికి బదులుగా 1230గా అని రాశారు.

Yusuf Pathan's highest ODI score is 1230... that's what Wikipedia says

2010లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పఠాన్ 96 బంతుల్లో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు యూసఫ్ పఠాన్ వ్యక్తిగత అత్యధిక స్కోరు అదే. దీంతో పాటు వన్డేల్లో పఠాన్ సాధించిన వ్యక్తిగత పరుగులను కూడా వికీపీడియా తప్పుగా పేర్కొంది.

Yusuf Pathan's highest ODI score is 1230... that's what Wikipedia says

భారత్ తరుపున పఠాన్ 57 మ్యాచుల్లో 810 పరుగులు సాధించగా, వెయ్యి పరుగులు సాధించినట్లు పేర్కొంది. ఇక భారత్ తరుపున యూసఫ్ పఠాన్ వన్డే మ్యాచ్ చివరిసారిగా మార్చి 18, 2012లో ఆడాడు. ఐపీఎల్‌లో తొలుత రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడిన పఠాన్, ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+