Legends League: యూసుఫ్ ప‌ఠాన్‌ విశ్వ‌రూపం.. ఇండియా మహారాజస్ జ‌య‌భేరి

Yusuf Pathan Just 40 Balls 80 Runs.. India Maharajas Beat Asian Lions

లెజెండ్స్ క్రికెట్ లీగ్ గురువారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్, ఆసియా లయన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. భార‌త మాజీ ఆట‌గాళ్లంతా ఇండియా మ‌హారాజాస్ టీమ్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌గా, ఆసియాలోని ఇత‌ర దేశాల మాజీలంతా ఆసియా ల‌య‌న్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగారు. అయితే ఆసియా ల‌య‌న్స్‌పై ఇండియా మ‌హారాజాస్ బ్యాట‌ర్ యూసుఫ్ ప‌ఠాన్ చెల‌రేగాడు. భారీ సిక్స‌ర్లు, ఫోర్ల‌తో విశ్వ‌రూపం చూపించాడు. 39 ఏళ్లోచ్చినా త‌న‌లో స‌త్తా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తూ ఇండియా మ‌హారాజాస్‌కు ఘ‌న విజయాన్ని అందించాడు.

చెల‌రేగిన త‌రంగ‌

మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆసియా ల‌య‌న్స్ శ్రీలంక మాజీ క్రికెట‌ర్ ఉపుల్ త‌రంగా హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. త‌రంగ 7 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 46 బంతుల్లోనే 66 ప‌రుగులు చేశాడు. అత‌నికి తోడుగా పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్, ల‌య‌న్స్‌ కెప్టెన్ మిష్బా 30 బంతుల్లోనే 44 ప‌రుగులతో రాణించాడు.

అత‌ని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఇక హ‌ఫీజ్ 16 ప‌రుగులు చేయ‌గా మిగ‌తావారెవ‌రూ క‌నీసం రెండంకెల స్కోర్ కూడా చేయ‌లేక‌పోయారు. ఇండియా మ‌హారాజాస్ బౌల‌ర్ల‌లో మన్‌ప్రీత్ గోనీ 3 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. మిగ‌తా వారిలో ఇర్ఫాన్ ప‌ఠాన్ 2, స్టువ‌ర్ట్ బిన్నీ, మునాఫ్ ప‌టేల్ త‌లో వికెట్ తీశారు.

ఆరంభంలోనే ఎదురు దెబ్బ‌

176 ప‌రుగుల ట‌ఫ్ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇండియా మ‌హారాజాస్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. జ‌ట్టు స్కోర్ 17 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 10 ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ స్టువ‌ర్ట్ బిన్నీని షోయ‌బ్ అక్త‌ర్ దెబ్బ కొట్టాడు. అనంత‌రం 26 ప‌రుగుల వ‌ద్ద బద్రినాథ్ డ‌కౌట్ అయ్యాడు. 34 ప‌రుగుల వ‌ద్ద 20 ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ న‌మాన్ ఓజాను ఉమ‌ర్ గుల్ ఫెమిలియ‌న్ చేర్చాడు.

ఆదుకున్న యూసుఫ్, కైఫ్‌

దీంతో 34 ప‌రుగులకే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో పడిన ఇండియా మ‌హారాజస్‌ను కెప్టెన్ మ‌హ్మ‌ద్ కైఫ్, యూసుఫ్ ప‌ఠాన్ ఆదుకున్నారు. వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు ఏకంగా 117 ప‌రుగులు జోడించారు. యూసుఫ్ ప‌ఠాన్ ఫోర్లు, సిక్స్‌ల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో జ‌ట్టు స్కోర్ 151 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 80 ప‌రుగులు చేసిన యూసుఫ్ ప‌ఠాన్ ర‌నౌట్ అయ్యాడు. అనంత‌రం ఇర్ఫాన్ ప‌ఠాన్‌తో క‌లిసి కెప్టెన్ మ‌హ్మ‌ద్ కైఫ్ మ‌రో 5 బంతులు మిగిలి ఉండగానే జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. దీంతో ఆసియా ల‌య‌న్స్‌పై ఇండియా మ‌హారాజ‌స్ 6 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది. ఈ క్ర‌మంలో కైఫ్ 42 ప‌రుగుల‌తో, ఇర్ఫాన్ 21 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచారు.

స్కోర్లు: ఆసియా ల‌య‌న్స్‌: 175-6, ఇండియా మ‌హారాజ‌స్‌: 179-4.

ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌: యూసుఫ్ ప‌ఠాన్‌

యూసుఫ్ విశ్వ‌రూపం

ఆసియా ల‌య‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజ‌స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన భార‌త మాజీ ఆట‌గాడు యూసుఫ్ ప‌ఠాన్ విశ్వ‌రూపం చూపించాడు. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు క్రీజులోకి వ‌చ్చిన యూసుఫ్ టీంను ఆదుకోవ‌డమే కాకుండా త‌న‌దైన స్టైలులో జ‌ట్టును విజ‌య తీరాలకు చేర్చాడు. 4 ఫోర్లు, 5 సిక్స్‌తో 28 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి హాఫ్ సెంచ‌రీ పూర్తి చేయ‌డం గ‌మనార్హం. ఈ మ్యాచ్‌లో మొత్తం 40 బంతులు ఎదుర్కొన్న యూసుఫ్ ప‌ఠాన్ 9 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 200 స్ట్రైక్‌రేట్‌తో 80 ప‌రుగులు చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, January 21, 2022, 9:56 [IST]
Other articles published on Jan 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X