
న్యూఢిల్లీ: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం 'యప్ టీవీ' బీసీసీఐ హోం సీజన్ డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఇకనుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని యప్‌టీవీ యూజర్లు తమ ఫేవరెట్ క్రికెట్ మ్యాచ్‌లను ఈ ఫ్లాట్‌ఫాంపై ప్రత్యక్షంగా చూసి ఆనందించొచ్చు. ఈ హోమ్ సీజన్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్‌లు తలపడే మ్యాచ్‌లను క్రీడాభిమానులు లైవ్‌లో వీక్షించొచ్చు.
కాంటినెంటల్ యూరప్, సెంట్రల్ ఏసియా, భారత్‌ను మినహాయించి సార్క్ దేశాల్లో, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికాలోని అభిమానులు యప్ టీవీ ద్వారా క్రికెట్‌ను ఆస్వాదించొచ్చు. బీసీసీఐ హోమ్ సీజన్ హక్కులు కైవసం చేసుకోవడంపై 'యప్ టీవీ' ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ ఈవెంట్‌ను తమ యూజర్లు లైవ్‌లో యాక్సెస్ చేసుకునేందుకు తాము బీసీసీఐ హోం సీజన్ డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్నామని ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న ప్రజలకు దక్షిణాసియా అత్యుత్తమంగా ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ కంటెంట్ అందించేందుకు ఎప్పటికీ ముందుంటాం అని సీఈవో తెలిపారు. ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు యప్‌టీవీలో వీక్షించవచ్చు. యప్‌టీవీ.కాంను లాగ్ అవడం లేదా స్మార్ట్ టీవీల్లో యప్‌టీవీ యాప్‌ల ద్వారా వివిధ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర డివైజ్‌ల్లో ఆయా మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చని యప్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా క్రికెట్ సిరీస్‌లను www.yupptv.comకు లాగిన్ అవ్వడం లేదా ఇతర డివైజుల్లో చూడొచ్చు. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల పోరుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 14న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ యప్ టీవీలో ఆస్వాదించొచ్చు. అయితే టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనుంది కాబట్టి ఆ మ్యాచులను చూడలేం.