Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2019: డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న యప్‌టీవీ

IPL 2019 : YuppTV Acquired Digital Rights To 2019 IPL Season | Oneindia Telugu
YuppTV bags digital broadcast rights of IPL 2019 for viewers outside India

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను దక్షిణాసియా అంతటా ప్రఖ్యాతి గాంచిన యప్‌టీవీ సొంతం చేసుకుంది. తాజా ఒప్పందంతో ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరోప్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాతో పాటు సెంట్రల్ ఆసియా, ఆగ్నేయ ఆసియాలలో మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నట్లు యప్‌ టీవీ యాజమాన్యం పేర్కొంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సందర్భంగా యప్‌టీవీ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉదయ్‌ రెడ్డి మాట్లాడుతూ "ఐపీఎల్‌ 2019 సీజన్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులకు వారి అభిమాన క్రీడలను ఎప్పుడంటే అప్పుడు వీక్షించేలా ప్రసారం చేస్తాం. ఇంటర్నెట్‌ ఆధారితంగా ఈ ప్రసారాలు కొనసాగుతాయని తెలిపారు" అని అన్నారు.

ఐపీఎల్‌ సరికొత్త సీజన్‌ మార్చి 23న ప్రారంభమైంది. 8 జట్లు 60 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అభిమానులు https://www.yupptv.com/cricket/ipl-2019/live-streaming లింక్‌ ద్వారా మ్యాచ్‌లు చూడొచ్చు. అంతేకాక స్మార్ట్‌ టీవీలలో యప్‌టీవీ యాప్‌ ద్వారా, స్మార్ట్‌ బ్లూ - రే ప్లేయర్‌ ద్వారా ఐపీఎల్‌ ప్రత్యక్ష ప్రసారాలను చూడొచ్చు.

ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక, యప్ టీవీ విషయానికి వస్తే 200 టీవీ చానెళ్లతో పాటు భారత్‌లోని 2000+ సినిమాలు ఇందులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్‌ ఆధారిత ఓటీటీ వేదిక యప్‌ టీవీనే. భారత్‌కు చెందిన వీడియో కంటెంట్‌ను చూసేందుకు విదేశాల్లోని భారతీయులు ఎక్కువగా ఎంచుకొనేది యప్‌ టీవీనే ఎంచుకుంటారు.

Story first published: Tuesday, March 26, 2019, 18:47 [IST]
Other articles published on Mar 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+