హైదరాబాద్: సీటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌ల్లో భారత టెన్నిస్ ఆటగాడు యుకి బాంబ్రి సంచలన విజయాలను నమోదు చేస్తున్నాడు. తాజాగా గురువారం ప్రపంచ నెంబర్ 100వ ఆటగాడు గైడో పెల్లా (అర్జెంటీనా)పై 6-7(5), 6-3, 6-1తో విజయం సాధించి టోర్నీలో క్వార్టర్స్‌కి దూసుకెళ్లాడు.
గైడో పెల్లా తొలి రౌండ్‌లో భారత్‌కు చెందిన టెన్నిస్ ఆటగాడు రామ్‌కుమార్ రామ్‌నాథన్‌ను ఓడించాడు. సుమారు గంటా 55 నిమిషాల పాటు హోరా హోరీగా సాగిన పోరులో బాంబ్రి విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో బాంబ్రి ప్రపంచ నం.45 ఆటగాడు కెవిన్ అండర్స్‌న్ (దక్షిణాఫ్రికా)తో తలపడనున్నాడు.
క్వార్టర్స్‌కి ముందు ప్రపంచ నెంబర్ 22 ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)కు షాకిచ్చాడు. హోరాహోరీగా సాగిన రెండో రౌండ్లో యుకి 6-3, 4-6, 7-5తో ఆరోసీడ్ మోన్‌ఫిల్స్‌ను ఓడించాడు. యుకి బాంబ్రికి ఇది కెరీర్‌లోనే రెండో అతిపెద్ద విజయం. 2014 చెన్నై ఓపెన్‌లో బాంబ్రి ప్రపంచ నెంబర్ 15 ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)పై గెలిచాడు.