భారత్ గెలవాలని నాలుక కోసుకున్న యువకుడు: ఫలితం సున్నా
వెల్లూరు: ఐసిసి ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై భారత విజయాన్ని కోరుతూ ఓ క్రికెట్ అభిమాని నాలుక కోసుకున్నాడు. దైవం భారత్ విజయానికి సహకరించాలని ప్రార్థిస్తూ తమిళనాడు అతను ఈ చర్యకు ఒడిగట్టాడు.
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా పొన్నేరి గ్రామానికి చెందిన సుధాకర్‌కు క్రికెట్ అంటే వల్లమాలిన అబిమానం. సెమీ ఫైనల్ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 328 పరుగుల భారీ స్కోరు సాధించడంతో అతను విచారంలో మునిగిపోయాడు.

ఆ అసంతృప్తి సెగలతో అతను ఆలోచన కోల్పోయి ప్రవర్తించాడు. తన నివాసంలో అతను నాలుక కోసుకున్నాడని జోలార్‌పేట పోలీసులు చెప్పారు. నాలుక కోసుకోవడంతో పుట్టిన నొప్పి కారణంగా అతను అరవడం మొదలు పెట్టాడు.
అతని కేకలు విన్న బంధవులు, ఇరుగుపొరుగువారు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. అతన్ని హుటాహుటిన అదడుక్కమపరాయ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications