న్యూఢిల్లీ : క్రికెటర్ గా రికార్డులన్నీ మైదానంలోనే..! ఇంట్లో అడుగుపెడితే కొడుకు ప్రేమ ముందు మోకరిల్లాల్సిందే. భారత క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను చూస్తే ఈ మాటలు ఒప్పుకోక తప్పదు. టీమ్ ఇండియా జట్టులో చోటు కోల్పోయిన పఠాన్.. ప్రస్తుతం మ్యాచ్ లు ఏమిలేక ఇంటి దగ్గరే తీరిగ్గా తన కొడుకుతో ఆటలాడుకుంటున్నాడు.
తాజాగా తన మూడేళ్ల కొడుకు అయాన్ కోసం గుర్రం అవతారమెత్తాడు యూసుఫ్ పఠాన్. అసలే పిల్లలు.. పట్టిన పట్టు విడవరు కదా..! దీంతో పఠాన్ కూ తప్పలేదు. గుర్రం కావాలని తెగ మారాం చేస్తున్న కొడుకును ఎలా బుజ్జగించాలో తెలియక ఇలా.. తానే గుర్రం అవతారమెత్తి కొడుకును సంతోషపెట్టాడు. ఆ ఫోటోల్ని పఠాన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇప్పుడా ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.