షమీ.. యువర్ ఇంగ్లీష్ బహుత్ అచ్చా!: నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ (వీడియో)

హైదరాబాద్: మౌంట్ మాంగనూయ్ వేదికగా సోమవారం ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో మరో రెండు వన్డేలు మిగిలుండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టీమిండియాకు ఇది వరుసగా రెండో సిరిస్ విజయం.
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ షమీ(3/41)కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. మ్యాచ్ అనంతరం షమీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే సమయంలో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ హిందీలో మాట్లాడే మహమ్మద్ షమీ, సోమవారం మాత్రం ఇంగ్లీషులో మాట్లాడాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా షమీ
ఈ సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన షమీ మ్యాచ్ అనంతరం అవార్డు అందుకునే క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సాయం తీసుకున్నాడు. షమీ హిందీలో మాట్లాడగా.. కోహ్లీ ఇంగ్లీష్‌లోకి అనువదించాడు. అయితే, సోమవారం కూడా షమీ వెంట కోహ్లీ వచ్చినప్పటికీ, ఇంగ్లీషులోనే మాట్లాడాడు.
షమీ ఇంగ్లీష్‌కు ముగ్ధుడైన కామెంటేటర్
షమీ ఇంగ్లీష్‌కు ముగ్ధుడైన కామెంటేటర్, న్యూజిలాండ్ మాజీ పేసర్ సిమన్ డౌల్ "షమీ యువర్ ఇంగ్లీష్ బహుత్ అచ్చా.. అభినందనలు" అని హిందీలో ప్రశంసలు కురిపించాడు. దీంతో పక్కనే ఉన్న కోహ్లీ... షమీ భుజం తట్టి మరీ అభినందించడంతో అక్కడ నవ్వులు పూసాయి.

సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో న్యూజిలాండ్‌లో ఎదురుగాలుల్లో బౌలింగ్ చేయడం ఎలా ఉందని షమీని డౌల్ ప్రశ్నించారు. దీనికి షమీ "నిజానికి ఎదురుగాలుల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. అయితే, మరో ఎండ్ నుంచి భువీ సాయం అందించాడు. సరైన ప్రదేశాల్లో బంతులను సంధించడమే ముఖ్యం" అని షమీ అన్నాడు.

హాఫ్ సెంచరీలతో రాణించిన రోహిత్, కోహ్లీ
న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 43 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (62), విరాట్ కోహ్లీ (60), అంబటి రాయుడు(40), దినేశ్ కార్తీక్(38) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications