For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీతో బాబర్‌ను పోల్చడం తొందరపాటే.. ఒకవేళ పోల్చుకోవాలంటే.. :యూనిస్ ఖాన్

Younis Khan thinks comparing Babar Azam with Virat Kohli doesn’t make sense

ఇస్లామాబాద్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాకిస్థాన్ పరిమిత ఓవర్ల సారథి బాబర్ అజామ్‌ని కొందరు పాక్ క్రికెట్ మాజీలు, అభిమానులు పోల్చుకుంటున్న విషయం తెలిసిందే. కోహ్లీని అజామ్ పరుగుల్లో అధిగమించగలడని ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా ఇప్పటికే జోస్యం చెప్పాడు. కోహ్లీని అధిగమించే అన్ని లక్షణాలు ఉన్నాయి, అంతేకాదు కోహ్లీ కంటే గొప్ప ఆటగాడిగా అయ్యే సామర్థ్యం అజామ్‌లో ఉందని రమీజ్ అన్నాడు. అయితే కోహ్లీతో అజామ్‌ని పోల్చడం సరికాదని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.

పాక్ 'విరాట్ కోహ్లీ':

పాక్ 'విరాట్ కోహ్లీ':

గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న బాబర్ అజామ్‌ని పాకిస్థాన్ అభిమానులు ముద్దుగా.. పాక్ 'విరాట్ కోహ్లీ' అని పిలుచుకుంటారు. అక్కడితో ఆగకుండా కోహ్లీని మించిపోయాడని కామెంట్లు చేస్తారు. అయితే 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న కోహ్లీతో కేవలం ఐదేళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న బాబర్‌ని పోల్చడం సరికాదని యూనిస్ అంటున్నాడు. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అజామ్‌ అగ్రస్థానంలో ఉండగా.. వన్డేలలో 3, టెస్టులలో 5వ స్థానంలో ఉన్నాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అజామ్.. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్నాడు.

పోలిక సరికాదు:

పోలిక సరికాదు:

తాజాగా యూనిస్ ఖాన్ గల్ఫ్ న్యూస్‌తో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ కెరీర్ పరంగా అత్యుత్తమ దశలో ఉన్నాడు. దశాబ్ద కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతూ మూడు ఫార్మాట్లలోనూ తానేంటో నిరూపించుకున్నాడు. కోహ్లీ సాధించిన 70 సెంచరీలు అతని బ్యాటింగ్ సామర్థ్యానికి నిదర్శనం. మరోవైపు బాబర్ అజామ్ ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. వన్డే, టెస్టుల్లో బాబర్ మంచి సగటుని కొనసాగిస్తూ.. 16 సెంచరీలు నమోదు చేశాడు. ఒకవేళ ఇద్దరి మధ్య ఇప్పుడు పోలిక తేవాలంటే? కోహ్లీ ఆడిన మొదటి ఐదేళ్లతో బాబర్ అజామ్‌ని పోల్చండి' అని యూనిస్ సూచించాడు.

కోహ్లీని అధిగమించగలడు

కోహ్లీని అధిగమించగలడు

రమీజ్ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'బాబర్ అజామ్‌కి ఇప్పుడు ఎదిగేందుకు మంచి అవకాశం. అతని చుట్టూ మెరుగైన వాతావరణం ఉంచుతూ.. సరైన ప్రోత్సాహం ఇవ్వాలి. లేకపోతే అతను తన సామర్థ్యం మేరకు రాణించలేడు. ఇప్పటికే బాబర్ అజామ్ సాధించిన పరుగులు, గెలిపించిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీని అధిగమించగల సామర్థ్యం అతనికి ఉందనిపిస్తోంది' అని అన్నాడు. 'కోహ్లీని అధిగమించే అన్ని లక్షణాలు అజామ్‌లో ఉన్నాయి. కోహ్లీ కంటే గొప్ప ఆటగాడిగా అయ్యే సామర్థ్యం అజామ్‌లో ఉంది. అయితే కోహ్లీని దాటాలంటే అజామ్‌ ఆటను మరింత మెరుగుపరుచుకోవాలి' అని అన్నాడు.

16 సెంచరీలు

16 సెంచరీలు

2015లో పాకిస్థాన్ జట్టులోకి వచ్చిన బాబర్ అజామ్ ఇప్పటి వరకూ 26 టెస్టులాడి 45.12 సగటుతో 1,850 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 74 వన్డేల్లో 54.18 సగటుతో 3,359 పరుగులు చేసాడు. వన్డేల్లో 11 శతకాలు, 15 అర్ధ శతకాలు సాధించాడు. ఇక 38 టీ20లు ఆడి 50.72 సగటుతో 1,471 పరుగులు చేశాడు. ప్రస్తుతం బాబర్ అజామ్ వయసు 25 ఏళ్లు కాగా.. ఈ వయసులో కోహ్లీ గణాంకాలు ఇలా లేవు.

70 సెంచరీలు

70 సెంచరీలు

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

Story first published: Monday, May 18, 2020, 14:05 [IST]
Other articles published on May 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+