Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్ స్ఫూర్తిగా... పాక్ అండర్-19 కోచ్‌గా యూనిస్ ఖాన్

Younis Khan set to be appointed as Pakistan U-19 coach: PCB

హైదరాబాద్: పాకిస్థాన్ అండర్-19 జట్టుకు హెడ్ కోచ్‌గా మాజీ క్రికెట్ దిగ్గజం యూనిస్ ఖాన్‌ను నియమిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు అవసరమైన లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌‌ని ఇండియా-ఎ, అండర్‌-19 జట్ల కోచ్‌‌గా నియమించిన తర్వాత భారత క్రికెట్లో ఎంత గొప్ప మార్పు వచ్చిందో అందరికీ తెలిసిందే. ద్రవిడ్ శిక్షణలో ఎంతో మంది యువ ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకుకోవడంతో పాటు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇదే తరహాలో తమ క్రికెట్‌ వ్యవస్థను కూడా పటిష్టం చేసుకోవడానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సన్నాహాలు ఆరంభించింది. ఇందులో భాగంగా ద్రవిడ్‌ మాదిరే పాకిస్థాన్‌ జట్టులో మిస్టర్‌ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న క్రికెట్ దిగ్గజం యూనిస్‌ ఖాన్‌ను తమ జాతీయ అండర్‌-19 జట్టు కోచ్‌గా నియమించింది.

దీంతో పాటు జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛీఫ్‌గా కూడా యూనిస్ ఖాన్ కొనసాగుతాడు. హెడ్ కోచ్‌తో పాటు జూనియర్ సెలక్షన్ కమిటీ ఛీఫ్‌గా యూనిస్ ఖాన్‌కు పుల్ పవర్స్ ఇచ్చినట్లు పీసీపీ అధికారి ఒకరు తెలిపారు. యూనిస్ ఖాన్‌కి తోడుగా మాజీ టెస్టు ప్లేయర్ నదీమ్ ఖాన్‌ను మేనేజర్‌గా ఎంపిక చేశారు.

వీరిద్దరి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఎంపిక చేసినట్లు పీసీబీ తెలిపింది. వచ్చే ఐసీసీ యూత్ వరల్డ్ కప్ వరకు వీరిద్దరూ కలిసి పనిచేయనున్నట్లు పీసీబీ పేర్కొంది. యూనిస్ ఖాన్ సైతం పాకిస్థాన్ అండర్-19 ఆటగాళ్లతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపినందుకే ఆతడిని హెడ్ కోచ్‌గా నియమించినట్లు పీసీబీ తెలిపింది.

Story first published: Monday, March 18, 2019, 10:06 [IST]
Other articles published on Mar 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+