Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దూరం 23 పరుగులు: తొలి పాకిస్తాన్ క్రికెటర్‌‌గా చరిత్ర

హైదరాబాద్: సిడ్నీ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడోటెస్టులో పాక్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అరుదైన ఘనతను సాధించే అవకాశాన్ని మిస్సయ్యాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో పదివేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

ఈ టెస్టులో మరో 23 పరుగులు చేసి ఉంటే పదివేల పరుగుల మైలురాయిని యూనిస్ ఖాన్ అందుకునేవాడు. తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు చేసి ప్రపంచంలోని అన్ని దేశాలపై టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు

13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు

ఇక రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. దాంతో ఈ సిరీస్‌లో పదివేల టెస్టు పరుగుల్ని సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. 39 ఏళ్ల యూనిస్ ఖాన్ 115 టెస్టు మ్యాచ్‌లాడి 9,977 పరుగుల్ని సాధించాడు. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ తరుపున టెస్టు క్రికెట్‌లో యూనిస్ ఖాన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

34వ టెస్టు సెంచరీ

34వ టెస్టు సెంచరీ

సిడ్నీ టెస్టులోనే తన కెరీర్‌లో 34వ టెస్టు సెంచరీని సాధించాడు. అంతేకాదు ఇప్పటివరకూ పాకిస్తాన్ ఆటగాళ్లు ఎవ్వరూ పదివేల పరుగుల మైలురాయిని అందుకోలేదు. మరికొన్ని రోజులు పాక్ తరుపున యూనిస్ ఖాన్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో పదివేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.

తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా నిలిచేవాడు

తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా నిలిచేవాడు

ఇదే గనుక జరిగితే ఈ అరుదైన ఘనతను సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇదిలా ఉంటే మూడో టెస్టులో ఆస్ట్రేలియా 220 పరుగుల తేడాతో భారీ విజయం సాధించించింది. దీంతో మూడు టెస్టుల మ్యాచ్ సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 1999 నుంచి ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ ఇలా వైట్ వాష్ కావడం నాలుగో సారి.

244 పరుగులకే ఆలౌట్

244 పరుగులకే ఆలౌట్

465 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ చేధనలో 244 పరుగులకే ఆలౌటైంది. ఓవర్ నైట్ ఆటగాళ్లు అజహర్ అలీ(11), యాసిర్ షా(3)లను ఆదిలోనే పెవిలియన్‌కు పంపడంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది. అనంతరం మిస్బావుల్ హక్(38), అసద్ షఫిక్(30)లు రాణించారు. సర్ఫరాజ్ అహ్మద్ (72) ఒక్కడే పోరాడినా మిగతా వారి నుంచి తగిన సహకారం లేకపోవడంతో పాక్ ఓటమి పాలైంది.

మ్యాచ్ జరిగిన తీరు ఇలా

మ్యాచ్ జరిగిన తీరు ఇలా

తొలి ఇన్నింగ్స్:

ఆస్ట్రేలియా 538/8 డిక్లేర్,

పాకిస్థాన్: 315 ఆలౌట్

రెండో ఇన్నింగ్స్

ఆస్ట్రేలియా: 241/2 డిక్లేర్

పాకిస్తాన్: 244 ఆలౌట్

మ్యాచ్ ఫలితం: 220 పరుగుల తేడాత పాక్‌పై ఆసీస్ విజయం

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+