Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూనిస్ ఖాన్ ఉదారత: ఛారిటీ సంస్ధలకు ప్రధాని క్యాష్ రివార్డు

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అందుకున్న 10 మిలియన్ నగదు బహుమతిని ఈద్ ఫౌండేషన్‌తో పాటు మరో రెండు సంస్ధలకు విరాళంగా ఇచ్చాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకి గత వారంలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ జట్టులోని ఆటగాళ్లతో పాటు చీఫ్ కోచ్ ఇంజమాముల్ హక్‌కి రూ. 10 మిలియన్ నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Younis Khan donates Rs 10 million to charity organisations

ఈ నేపథ్యంలో ప్రధాని ఇచ్చిన నగదు బహుమతిని యూనిస్ ఖాన్ ఈద్ ఫౌండేషన్‌తో పాటు ఇందుస్ హాస్పిటల్, ది సిటిజన్స్ ఫౌండేషన్స్‌కి యూనిస్ ఖాన్ విరాళంగా ఇచ్చినట్లు డాన్ పత్రిక రాసుకొచ్చింది. అంతేకాదు ఈ మొత్తానికి పన్ను మినహాయింపు కూడా ప్రధానిని యూనిస్ ఖాన్ కోరాడు.

పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ఈ మొత్తం పేదవారికి సాయపడుతుందని యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. ఇక బౌలింగ్ కోచ్ అజార్ మహ్మద్‌కి రూ. 5 మిలియన్, జట్టు మేనేజర్ తలత్ అలీ‌కి రూ. 2.5 మిలియన్ నగదు బహుమితిని ప్రకటించారు.

వీరితో పాటు జట్టు మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్, ఇన్ ఛార్జి ఆపరేషన్స్, క్రికెట్ ఎనలిస్ట్‌లకు రూ. 2.5 మిలియన్ ఇచ్చారు. జట్టుని ఎంపిక చేసిన సెలక్షన్ టీమ్‌కి రూ. 1 మిలియన్, కోచ్ మికీ ఆర్దర్, ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ ట్రాఫోర్డ్, బ్యాటింగ్ కోచ్ గ్రాండ్ ఫ్లవర్‌లకు రూ. 5 మిలియన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+