Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి దెబ్బ: ఒకరి తర్వాత ఒకరు, ఇప్పుడు యూనిస్ ఖాన్ గుడ్‌బై

బ్రిస్బేన్: పాకిస్థాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ వన్డేల నుంచి తప్పుకుంటున్నాడు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశాడు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే వన్డేలకు దూరంగా ఉండనున్నట్టు చెప్పాడు. అయితే టెస్ట్ కెరీర్‌ను కొనసాగిస్తానని తెలిపాడు.

కెరీర్లో మొత్తం 263 వన్డేలాడిన యూనిస్ 31.31 సగటుతో 7203 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో భారత్‌పై యూనిస్ ఖాన్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచులో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఇటీవల ప్రపంచకప్‌లో పాక్ రెండు వరుస పరాజయాలు చవిచూడడంతో యూనిస్ రిటైర్ కావాల్సిందేనని పలువురు మాజీలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Younis Khan Decides to Quit ODIs after World Cup 2015

సీనియర్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిదీ, కెప్టెన్ మిస్బావుల్ హక్ కూడా రిటైర్ అవుతున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ఇక యూనిస్ ఖాన్ రిటైర్మెంట్‌తో పాకిస్తాన్ బ్యాటింగ్‌లో తీవ్రమైన లోటు ఏర్పడే అవకాశం ఉంది. ఒకరి తర్వాత ఒకరు ఇలా వన్డేల నుంచి తప్పుకుంటానంటూ ప్రటనలు చేయడం ద్వారా పాకిస్తాన్ అత్మస్థయిర్యం కూడా దెబ్బ తినే పరిస్థితి వచ్చింది.

భారత్‌పై ఓటమి తర్వాత తమ దేశం మాజీ క్రికెటర్ల నుంచి కూడా పాకిస్తాన్ జట్టు తీవ్రమైన విమర్శలు ఎదుర్కోంది. మిస్బావుల్ హక్‌ను పిరికిపందగా అభివర్ణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్తాన్ కనీసం ప్రత్యర్థి జట్లకు పోటీ కూడా ఇవ్వడం లేదు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+