పాక్ తరుపున తొలి క్రికెటర్: యూనిస్ ఖాన్ అరుదైన ఘనత
హైదరాబాద్: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో పదివేల పరుగులు చేసిన మైలురాయిని దాటాడు. తద్వారా టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన 13వ ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు పాకిస్థాన్ తరఫున ఈ ఘనతను అందుకున్న తొలి క్రికెటర్‌గా యూనిస్ ఖాన్ చరిత్ర సృష్టించాడు.
జమైకా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో యూనిస్ ఖాన్ పది వేల పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టెస్టు మ్యాచ్‌లు నిర్వహించే అన్ని దేశాలపై కూడా యూనిస్ ఖాన్ సెంచరీలు చేయడం విశేషం. ప్రస్తుతం మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం పాకిస్థాన్ జట్టు వెస్టిండిస్‌లో పర్యటిస్తోంది.
తొలి టెస్టులో ఈ ఘనత
ఇందులో భాగంగా ఏప్రిల్ 21న కింగ్‌స్టన్‌లో సబీనా పార్క్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన పాకిస్థాన్ వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 201/4 (78.2 ఓవర్లు)
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ 78.2 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 201 పరుగులు పూర్తి చేసింది.
58 పరుగులు వద్ద యూనిస్ ఖాన్ అవుట్
ఈ మ్యాచ్‌లో 138 బంతులు ఎదుర్కొన్న యూనిస్ ఖాన్ 58 పరుగులు చేసి అవుటయ్యాడు. టీ విరామం తర్వాత యూనిస్ పదివేల మైలురాయిని అధిగమించాడు.
టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయి
మొత్తం 116 టెస్టుల్లో 53 యావరేజితో యూనిస్ ఖాన్ పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 208 ఇన్నింగ్స్‌ల్లో యూనిస్ ఖాన్ పదివేల పరుగులు సాధించాడు.
మొత్తం 34 టెస్టు సెంచరీలు చేసిన యూనిస్
యూనిస్ ఖాన్ మొత్తం 34 టెస్టు సెంచరీలు చేశాడు. మ్యాచ్ అనంతరం యూనిస్ ఖాన్ మాట్లాడాడు. పాకిస్థాన్ రెన్ మెషీన్ యూనిస్ అంటూ పీసీబీ చీఫ్ నాజమ్ అజీత్ తెలిపారు.
నా కుటుంబసభ్యులకు ఈ విజయం అంకితం
‘నన్ను ఎంతగానో ప్రోత్సహించిన నా కుటుంబసభ్యులకు ఈ విజయం అంకితం. ఈ ఘనత ప్రతి ఒక్క పాకిస్థానియుడిది. పాకిస్థాన్‌ది' అని యూనిస్ చెప్పాడు. పాక్ తరుపున ఈ ఘనతను సాధించిన యూనిస్ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications