Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌కు 'డబుల్' షాక్: అడ్డుగా నిలిచిన అలీ, యూనిస్

హైదరాబాద్: సిడ్నీ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 2 వికెట్లను కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 538/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టుకు అదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ వేసిన ఆస్ట్రేలియా బౌలర్ హజెల్ ఉడ్ పాకిస్థాన్‌కు గట్టి షాకిచ్చాడు. ఓపెనర్ షార్జిల్‌ ఖాన్‌ను 4 పరుగుల వద్ద, బాబర్ అజమ్‌‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు.

దీంతో పాకిస్థాన్ జట్టు 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో పాక్ మరో ఓపెనర్ అజహర్ అలీ, యూనిస్ ఖాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధసెంచరీలను పూర్తి చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అజహర్ అలీ(58), యూనిస్ ఖాన్ (64) క్రీజులో ఉన్నారు.

 Younis, Azhar lead Pakistan's reply in Sydney Test

పాకిస్థాన్ ఇంకా 412 పరుగుల వెనుకంజలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్ హజెల్ ఉడ్ 2 వికెట్లు తీసుకుని 32 పరుగులిచ్చాడు. అంతక ముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 538/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ హ్యండ్స్‌కోంబ్‌ 215 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు.

మరోవైపు ఓపెనర్ రెన్‌ షా 293 బంతులను ఎదుర్కొని 20 ఫోర్ల సాయంతో 184 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో తన కెరీర్‌లో తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మలచడంలో విఫలమయ్యాడు. రెన్‌ షా, హ్యాండ్స్‌కోంబ్, వార్నర్‌లు సెంచరీలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది.

పాకిస్థాన్ బౌలర్లలో వహాబ్ రియాజ్ మూడు వికెట్లు సాధించగా, ఇమ్రాన్ ఖాన్, అజహర్ అలీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+