దక్షిణాఫ్రికాతో సిరీస్.. మిథాలీ స్థానంలో 15 ఏళ్ల షెఫాలీ వర్మ

న్యూఢిల్లీ: భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో.. ఆ స్థానంలోకి 15 ఏళ్ల హర్యానా యువ సంచలనం షెఫాలీ వర్మ అరంగేట్రం చేయనుంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు జట్టును సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. దూకుడైన బ్యాటింగ్‌తో మిథాలీ సహా ఎంతో మంది ప్రశంసలు అందుకున్న షెఫాలీ ఈ సిరీస్‌కు ఎంపికైంది.

ఓపెనర్‌గా అవకాశం:
మహిళల ఐపీఎల్‌లో దుమ్ముదులపడం, అండర్-19, అండర్-23 దేశవాళీ క్రికెట్‌లో షెఫాలీ 150కి పైగా స్ట్రయిక్ రేట్‌తో వేగంగా పరుగులు చేస్తూ ఆకట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు షెఫాలీ ఎంపికయింది. సెహ్వాగ్ తరహాలో మెరుపులు మెరిపించే షెఫాలీ.. టీమిండియా తరుపున ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అతి చిన్న వయసులో అరంగేట్రం:
మహిళల క్రికెట్లో అతి చిన్న వయసులో (15 ఏళ్లు) అరంగేట్రం చేసిన రెండో అమ్మాయిగా షెఫాలీ వర్మ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు 14 ఏళ్లకే గ్రెయిగ్ బెనర్జీ (14 ఏళ్ల 165 రోజులు) టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. 1978లో తొలి వన్డే, 1984లో తొలి టెస్ట్ ఆడింది. షెఫాలీ ఆఫ్‌స్పిన్ కూడా వేయగలగడం మరో బలం. ఇంగ్లాండ్ స్టార్ క్రీడాకారిణి డ్యానియల్ వ్యాట్ కూడా షెఫాలీ ప్రతిభకు ముగ్దురాలైంది.

అరుంధతి రెడ్డికి స్థానం:
భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సిరీస్‌లో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. ప్రస్తుతం తొలి మూడు టీ20లకు జట్టును ప్రకటించగా.. ఐదు వన్డేలకు జట్టును ఎంపిక చేశారు. వన్డేల్లో మిథాలీ, టీ20లకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్లు. టీ20 జట్టులో తెలంగాణ అమ్మాయి అరుంధతి రెడ్డి స్థానం దక్కించుకుంది. ఈనెల 24న టీ20 సిరీస్.. వచ్చేనెల 9న వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications