Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni : ధోనీ కెప్టెన్సీ చూసి షాకైపోయిన యంగ్ ప్లేయర్.. అంత ఆలోచన చేస్తాడా?

క్రీడల్లో ఎంత మంది కొత్త కుర్రాళ్లు వస్తున్నా.. సీనియర్ల అనుభవాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అది కూడా ధోనీ వంటి అద్భుతమైన లీడర్లు ఏం చేసినా దాని వెనుక పెద్ద కారణమే ఉంటుంది. ఇలాంటి ఒక ఘటన గురించి టీమిండియా యంగ్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ వెల్లడించాడు. ఇప్పుడు ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. ధోనీ కెప్టెన్సీలో ఉండే స్పెషాల్టీ అదే అని ఫ్యాన్స్ అంటున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ధోనీ తెలివి చూసి తాను షాకయ్యానని అయ్యర్ చెప్పుకొచ్చాడు. తనను అవుట్ చేయడానికి ధోనీ ఒక కొత్త తరహా వ్యూహం వేశాడని తెలిపాడు. 'నేను, ఇంకో బ్యాటర్ ఆడుతుండగా.. ఆఫ్‌సైడ్‌లో షార్ట్ థర్డ్ మ్యాన్, కవర్ ఫీల్డర్లు ఉన్నారు. అంతా బాగానే ఉంది. అంతలోనే ధోనీ ఒక ఫీల్డర్‌ను పిలిచి ఆన్‌సైడ్ పంపించాడు. ఆ తర్వాతి బంతికే నాతో పాటు ఉన్న బ్యాటర్ అవుటయ్యాడు' అని వెంకటేశ్ అయ్యర్ చెప్పాడు.

 Young star is shocked with MS Dhoni captaincy shares the story

'ఫీల్డింగ్ మారిన తర్వాతి బంతికే అలా తను ఎలా అవుటయ్యాడు? కనీసం 3-4 డెలివరీలైనా ఎదుర్కోవాలి కదా? అని అనుకున్నా. ఆ వెంటనే ధోనీ తెలివి చూసి ఆశ్చర్యపోయా. ఇక ఈ సీజన్‌లో నేను షార్ట్ థర్డ్ మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యా. తీరా చూస్తే.. మామూలుగా షార్ట్ థర్డ్ మ్యాన్ అక్కడ ఉండడు. అది కూడా ధోనీ ప్లానే. మ్యాచ్ అయిపోయాక అసలు అక్కడ ఫీల్డర్‌ను అలా ఎందుకు పెట్టావ్? అని ధోనీని ఇదే అడిగా' అని తెలియజేశాడు.

'బంతిని వదిలేసినప్పుడు అది వెళ్తున్న విధానం బట్టి చూస్తే.. ఫీల్డర్ ఎప్పుడూ ఉండే చోట ఉండకూడదని ధోనీకి తెలిసిందట. ఆ మాట విని ఆశ్చర్యపోయా. ఎందుకంటే నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. అక్కడికక్కడ అంత దూరం ఆలోచించి, బంతి యాంగిల్‌ను అర్థం చేసుకొని ఫీల్డింగ్ పెట్టడం అంటే మాటలు కాదు. అది చాలా పెద్ద బలం' అని వెంకటేశ్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. అలాగే ఒక్క ధోనీ విషయంలో తను పెద్ద క్రికెట్ స్టార్‌ని చూసినట్లు ఫీల్ అవుతానన్నాడు.

రోహిత్, కోహ్లీ వంటి వారితో ఉంటే.. చాలా గొప్ప ప్లేయర్లతో ఉన్నట్లు ఉంటుందని, కానీ ధోనీ చుట్టూ ఉండే ఆరానే వేరని వెంకటేశ్ అన్నాడు. 2021లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీతో కలిసి వెంకటేశ్ ఆడిన సంగతి తెలిసిందే. 'నేను బ్యాటింగ్ చేసేప్పుడు వెనక ధోనీ నిలబడి ఉంటే ఆ ఫీలింగ్ వేరు. వార్మప్స్‌లో బిజీగా ఉన్నప్పుడు సడెన్‌గా ప్రేక్షకులు పెద్దగా కేకలు వేశారు. చూస్తే ధోనీ మైదానంలోకి ఎంటర్ అవుతున్నాడు. తను చాలా చిల్‌గా కనిపిస్తాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాలే ధోనీకి ఉండవు' అని వివరించాడు.

Story first published: Sunday, July 2, 2023, 17:50 [IST]
Other articles published on Jul 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+