Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలింగ్‌తో అదరగొట్టిన బుడ్డోడు!

అండర్-19 వరల్డ్ కప్ 2026 ప్రారంభ మ్యాచ్‌లోనే భారత యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బౌలింగ్ మ్యాజిక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టిస్తున్న వైభవ్, ఇప్పుడు బంతితోనూ వికెట్లు తీస్తూ 'ఆల్‌రౌండర్' అవతారమెత్తాడు. జింబాబ్వేలోని బులవాయో వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ప్రధానంగా వినిపించిన పేరు హెనిల్ పటేల్ (5 వికెట్లు) అయినప్పటికీ.. చివర్లో వైభవ్ సూర్యవంశీ చేసిన బౌలింగ్ విన్యాసం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

రెండో బంతికే కీలక వికెట్
అమెరికా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్లు, ఆ జట్టును కేవలం 107 పరుగులకే కట్టడి చేశారు. ఇన్నింగ్స్ 36వ ఓవర్‌లో బంతిని అందుకున్న వైభవ్ సూర్యవంశీ, తాను వేసిన రెండో బంతికే అమెరికా టాప్ స్కోరర్ నితీష్ సుదిని (36) ను ఔట్ చేశాడు. సుదిని భారీ షాట్ కొట్టబోయి లాంగ్-ఆఫ్ వద్ద ఉన్న కిలన్ పటేల్‌కు చిక్కాడు. దీంతో అమెరికా ఇన్నింగ్స్ 35.2 ఓవర్లలో 107 పరుగుల వద్ద ముగిసింది.

Young Sensation Shines with the Ball Vaibhav Suryavanshi Impresses in U19 World Cup 2026

హెనిల్ పటేల్ 'ఐదు' వికెట్ల పంజా
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ హెనిల్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అమెరికా వెన్ను విరిచాడు. భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

మ్యాచ్ హైలైట్స్:
యూఎస్ఏ స్కోరు: 107/10 (35.2 ఓవర్లు)

భారత బౌలింగ్: హెనిల్ పటేల్ (5/16), వైభవ్ సూర్యవంశీ (1/2).

Story first published: Thursday, January 15, 2026, 17:05 [IST]
Other articles published on Jan 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+