Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక ఇంటి వాడైన టీమిండియా స్టార్ ఓపెనర్.. ఆమె కూడా క్రికెటరే..!

నిన్నకాక మొన్ననే ధోనీతో కలిసి ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడాడీ యువ ఓపెనర్. ఆ ఆనందం మర్చిపోక ముందే మరో గుడ్ న్యూస్ చెప్పాడు. అతనే టీమిండియా యువ స్టార్ రుతురాజ్ గైక్వాడ్. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఒక ఇంటి వాడయ్యాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఉత్కర్షకు మూడు ముళ్లు వేశాడు.

ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న గైక్వాడ్.. 'స్టేడియం నుంచి మండపం వరకు.. మా జర్నీ మొదలైంది' అని క్యాప్షన్ తగిలించాడు. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న గైక్వాడ్.. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Ruturaj Gaikwad ties knot with Utkarsha

ఈ సీజన్‌లో అతను 16 మ్యాచుల్లో 590 పరుగులతో ఆకట్టుకున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా మంచి ఆరంభాలు అందించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌లో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో స్టాండ్ బై ప్లేయర్‌గా అతన్ని బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే పెళ్లి ఉండటంతో అతని స్థానాన్ని యశస్వి జైస్వాల్‌తో భర్తీ చేసింది.

సీఎస్కే కెప్టెన్ ధోనీ ఇటీవలే మోకాలికి శస్త్రచికిత్స్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను ఈ వివాహానికి హాజరైనట్లు కనిపించడం లేదు. అందుకేనేమో చెన్నై టీం ట్రోఫీ నెగ్గినప్పుడే ఉత్కర్ష వెళ్లి ధోనీ ఆశీర్వాదం తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ఉత్కర్ష కూడా క్రికెటరే. ఆమె కూడా దేశవాళీల్లో మహారాష్ట్ర తరఫునే ఆడుతుంది. ఈ టీంలో ఉత్కర్ష ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్. తన 11వ ఏట నుంచే ఉత్కర్ష క్రికెట్ ఆడుతుందని సమాచారం. ఈ క్రమంలోనే ఆమెకు రుతురాజ్ పరిచయం అయ్యాడట. అంతేకాదు, రుతురాజ్ కూడా మహారాష్ట్రకే ప్రాతినిధ్యం వహిస్తాడనే సంగతి తెలిసిందే. ఈ కొత్త జంటపై నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Story first published: Sunday, June 4, 2023, 9:24 [IST]
Other articles published on Jun 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+