పెనుముప్పు తప్పించుకున్న ఇండియన్ యంగ్ క్రికెటర్
అలప్పుజ : భారత క్రికెటర్ కరుణ్ నాయర్ తృటిలో స్నేక్ బోట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పంపా నదిలో పడవ తిరగబడడంతో ఇద్దరి ఆచూకీ గల్లంతవగా.. కరుణ్ నాయర్ తో సహా పలువురు సురక్షితంగా బయటపడ్డారు. పరిమితికి మించి ఎక్కువ మంది స్నేక్ బోట్ లో ప్రయాణించడంతోనే ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.

కాగా, వీరంతో శ్రీ పార్థసారథి స్వామి ఆలయంలో జరిగే వాల్లా సద్యా ఉత్సవం కోసం పలువురు ఈ స్నేక్ బోట్ లో బయలుదేరారు. అయితే దాదాపు 100 మంది దాకా బోట్ లో ఎక్కడంతో, పడవ ప్రమాదం సంభవించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రమాద సమయంలో రెస్క్యూ టీమ్ వెంటనే అప్రమత్తం అవడంతో భారీ ప్రమాదం తప్పటినట్టు ఆర్నామూలా పోలీస్ అధికారులు వెల్లడించారు.
గల్లంతయిన ఇద్దరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇకపోతే కర్ణాటకకు చెందిన కరుణ్ నాయర్ కు ఇటీవల జింబాబ్వే టూర్ లో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications